‼️ THE WAIT IS OVER | SADHGURU ON RAW TALKS | Telugu Podcast | Raw Talks With VK | EP - 115
నమస్కారం సద్గురు. నమస్కారం. అన్నిటికన్నా ముందుగా, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను మీ జీవిత ప్రయాణం గురించి తెలుసుకుంటున్నాను. 2024 లో మీకు జరిగిన ఒకటి, రెండు సర్జరీలు గురించి విన్నాను. ఒక షాక్‌లా ఉంటుంది కదా, సర్జరీలు ఏంటి? బ్రెయిన్ సర్జరీలు అది కూడా రెండుసార్లు అయినాయి. అది విన్నప్పుడు, నాకు అనిపించింది. మిమ్మల్నే అడుగుదాం అసలు ఎందుకు అయ్యాయి? ఆ సర్జరీలు ఎందుకు అయ్యాయి? నా తలని ఇక్కడ అక్కడ కొంచెం కొట్టుకున్నాను అంటే నిజంగానే కొట్టుకున్నారా? అంటే నిజంగానే కొట్టుకున్నారా? మీ తలకి ఏదో సీరియస్‌గా ఉందని మీకు ఎప్పుడు తెలిసింది?
నాకు అది జనవరి మధ్యలో తెలిసింది. అప్పుడు ఎందుకంటే, నా తలలో భరించలేని నొప్పి వస్తుండేది. నేను ఏ పెయిన్ కిల్లర్ వేసుకోలేదు ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకున్నాను. ఏదైనా జరుగుతుంటే నేను తెలుసుకోవాలి కదా. పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏమీ తెలీదు. నేను అమెరికాకి మార్చి 16 న వెళ్ళాల్సి ఉంది. నేను ఒక నెల ఖాళీగా ఉంచుకున్నాను నన్ను నేను సరిచేసుకోవడానికి. కానీ పనులు మరీ ఎక్కువైపోయాయి. ఆ తర్వాత నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను.
ఇంకా మహాశివరాత్రి ఉంది. అది మార్చి 8వ తేదీన. ఆ తర్వాత నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చింది ఆ తర్వాత ఢిల్లీ. అక్కడ ఒక ఈవెంట్ ఉండింది. అప్పటికే నొప్పి, మహాశివరాత్రి సమయంలో కూడా అది విపరీతంగా ఉండేది. నా కుడి వైపు దాదాపుగా మొద్దుబారిపోయింది. కానీ నేను అదంతా చేశాను నాకు అలా జరుగుతోందని చాలామందికి తెలీదు. ఆ తర్వాత ఢిల్లీలో మీరు ఇది చేయకూడదు అని డాక్టర్ అన్నారు.
అయితే నేను మాట ఇచ్చాను. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్, నేను చేస్తాను అని అన్నాను. తర్వాతి రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాను, డాక్టర్ అన్నారు. అసలు కుదరదు మీరు ఇది అస్సలు చేయకూడదు అని. ఎందుకంటే అప్పటికే నా మీడియన్ ఒక వైపుకి 11 మిల్లీమీటర్లు జరిగిపోయింది. అది క్షమించండి, ఒక వైపుకి 8 మిల్లీమీటర్లు. అది 12 అయితే ప్రాణాంతకం. ఇంకా 4 మిల్లీమీటర్లు ఉంది కదా నన్ను ఇది చేయనివ్వండి అన్నాను.
తప్పించుకోవడానికి ప్రయత్నించాను నేను ఎప్పుడూ ఏ ఈవెంట్‌ని రద్దు చేయలేదు. మాట ఇచ్చిన తర్వాత. నేను ఆలస్యంగా వెళ్ళను. రద్దు కూడా చేయను. నేను ఛానల్ యజమానులకి ఫోన్ చేసి. నాకు కొన్ని కుటుంబ పనులు ఉన్నాయి. నేను ఇది చేయలేను అని చెప్పాను. వాళ్ళు, సద్గురు, మీరు ఇలా ఎలా చేయగలరు? అందరూ టిక్కెట్లు కొన్నారు. వాళ్ళు కేవలం మీకోసమే వస్తున్నారు. మీరు రాకపోతే మొత్తం ఈవెంట్ రద్దయిపోతుంది అన్నారు. సరే నేను చేస్తాను అన్నాను. డాక్టర్, వద్దు అన్నారు.
మీరు చేయకూడదు అన్నారు. డాక్టర్, ఇది కేవలం 45 నిమిషాలే నన్ను చేయనివ్వండి అన్నాను. డాక్టర్ కూడా ఈవెంట్‌కి వచ్చారు ఎందుకంటే ఆయన చాలా భయపడ్డారు. ఆయన కళ్ళు పెద్దవి చేసుకొని అక్కడ కూర్చొని చూస్తున్నారు. ఆయనకి ఏం జరుగుతుందో అని భయం. 45 నిమిషాలు అయిపోయింది, యాంకర్ ఇంకొన్ని ప్రశ్నలు అడగాలని చూస్తున్నారు. అప్పటికే 25, 30 నిమిషాలు గడిచిన తర్వాత. నా ఎడమ కాలు దానికదే కదలడం మొదలుపెట్టింది. అది అది కొంచెం డాన్స్ చేస్తోంది. నాకు తెలుసు. సంభాషణ మధ్యలోనా? సంభాషణ మధ్యలో? అవును, సంభాషణ మధ్యలో.
అయితే, నేను అన్ని హద్దులు దాటానని నాకు తెలుసు. అది అయిపోయాక. నేను బయటికి రాగానే డాక్టర్ నన్ను ఇలా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన నా కాలు కదలడం గమనించారు. డాక్టర్, నేను అన్ని హద్దులు దాటేశాను మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అన్నాను. ఆయన నన్ను నేరుగా లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు ఎం.ఆర్.ఐ (MRI) తీసినప్పుడు. అది 11.5 మిల్లీమీటర్లు. నేను ప్రాణాంతక స్థితి నుండి 0.5 మిల్లీమీటర్ల దూరంలో ఉన్నాను. ఓ మై గాడ్. అది అయ్యాక సర్జరీకి వెళ్ళాను అది విజయవంతమైంది.
సరే, సర్జరీలు అంత సులువు కాదనుకోండి. మీరు ఎన్నిటినో అనుభవిస్తారు. ఆ తర్వాత. వాళ్ళు నాతో నేను ఆరు నెలల పాటు డ్రైవ్ చేయకూడదని. అలాగే రెండేళ్లపాటు మోటార్ సైకిల్ మీద కూర్చోకూడదని అన్నారు. అయితే, 18 రోజుల తర్వాత. నేను కోయంబత్తూరులో దిగినప్పుడు నేను ఎయిర్ పోర్ట్ నుండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. సద్గురు సద్గురు లాగే ఉంటారు. లేదు, విషయం అది కాదు. విషయం ఏంటంటే. మీ సొంత వైఖరుల వల్ల మిమ్మల్ని మీరు కుంగదీసుకోవడం చాలా సులభం.
ఇదే చాలామంది వారి జీవితాలకు చేసుకున్నారు. అలా నేను బాగా కోలుకుంటున్నాను. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రిజిస్టర్ చేసుకున్నారు. బాలిలో నాలుగు రోజులు, కంబోడియాలో మూడు రోజుల కార్యక్రమానికి. అది స్పెషల్ ప్రోగ్రామ్. ప్రజలు రిజిస్టర్ అయ్యారు. నేను క్యాన్సిల్ చేయడం సులభమే. కానీ వాళ్ళకి అది జీవితంలో ఒకసారి వచ్చే అనుభవం లాంటిది. కాబట్టి, నేను చేస్తాను అని చెప్పాను. శారీరకంగా చేసే పనులు చాలా ఉండేవి నేను అవన్నీ రద్దు చేశాను.
వాటిని వేరే వాళ్ళని చూసుకోమని చెప్పి. కేవలం క్లాస్ వరకు మాత్రమే నేను చూసుకుంటాను అని చెప్పాను. అర్థమైంది. అది బాగానే జరిగింది. నాకు వ్యాయామం అవసరం, కానీ దాదాపు నెల రోజులుగా నేను కదలలేదు. అందుకని ఈత కొట్టడం మొదలుపెట్టాను. ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని. మా అమ్మాయితో కలిసి ఈత కొడుతున్నాను. మేము పూల్ బయట కూర్చున్నాము. ఇలా ఒక కుర్చీలో కూర్చున్నాను ఆమె కింద కూర్చుంది. అప్పుడు ఒక పెద్ద కోతి వచ్చింది.
అది గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆమె ఆ కోతిపై అరిచింది. మీ కూతురా? అవును. ఆ కోతి ఆమెపై దాడి చేసింది. పెద్ద కోతి, దాని నోరు ఇలా తెరుచుకొని ఉంది. నేను కోతి చేసిన గాయాల్ని చూశాను అది మీ ముఖాన్ని చీల్చేయగలదు. ఓ మై గాడ్. అలా నేను ఇదంతా మర్చిపోయాను. నేను మర్చిపోయాను అనను నాకు తెలుసు. కానీ, నేను ఒక కర్రని గది లోపల పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే ఆ సమయంలో నేను కర్రతో నడుస్తుండేవాడిని. అది పూర్తిగా గ్లాస్ షీట్ డోర్. నేను దాన్ని తెరిచి ఉంచాను.
ఎవరో మూసేశారు. కాబట్టి ఆ కర్ర తీసుకోవడానికి పరిగెత్తి నేరుగా ఆ గ్లాస్ డోర్‌కి తల కొట్టుకున్నాను. బూమ్. కోతి పారిపోయింది అంత పెద్ద శబ్దానికి. ఇక ఢిల్లీకి తిరిగి వెళ్లి, డాక్టర్లు ఏం చేయగలరో చూద్దాం అనుకున్నాను. కానీ అప్పటికి ఇంకా మూడు రోజుల ప్రోగ్రాం ఉంది. రేపు ఉదయం వరకు చూద్దాం ఏ లక్షణాలు లేకపోతే చేసేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఏ లక్షణాలు లేవు కాబట్టి నేను కంబోడియా వెళ్ళాను. మూడు రోజుల ప్రోగ్రాం చేశాను. కోయంబత్తూరులో రాత్రి 11:30 కి దిగి.
నేరుగా ఎం.ఆర్.ఐ కి వెళ్ళాను. లోపల భారీగా రక్తస్రావం. మళ్ళీ ఇంకొక ఎమర్జెన్సీ సర్జరీ కోసం వెళ్ళాను. ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. ఇంకో 3 నెలల్లో కోలుకున్నాను. అంటే సర్జరీ కోసం మీరు హైదరాబాద్ వచ్చారా? రెండవ సర్జరీ. ఓకే. అలా మూడు నెలల్లో కోలుకున్నాను. ఏ రోజైతే వాళ్ళు సెడేటివ్స్ ఆపేశారో. ఆ రోజే మోటార్ సైకిల్ ఎక్కాను.
మరో రెండు నెలల్లో టెన్నెస్సీ నుండి టొరంటో. టొరంటో నుండి వాంకోవర్, వాంకోవర్ నుండి మళ్ళీ వెనక్కి రైడ్ చేశాను. ఆ తర్వాత కైలాష్‌కి బైక్ మీద వెళ్లాను. ఇదేమీ నిరూపించుకోవడానికి కాదు. మిమ్మల్ని మీరు కుంగదీసుకోకపోవడం ముఖ్యం. చాలా సులువుగా ప్రజలు అలా చేయగలరు. వాళ్ళు ఎప్పుడైనా కింద పడినప్పుడు, ఎముక విరిగితే, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అది చేయరు. ఎందుకంటే. జీవితం అలా పనిచేయదు.
మీరు గనక నిన్నటి భారాన్ని రేపటికి మోసుకెళితే. మీకు రేపటికి ఏమీ మిగలదు. చూడండి ఎలా ఉన్నానో బాగానే ఉన్నాను. కార్యక్రమాలు అన్నీ అప్పటి నుండి నా కార్యకలాపాలు రెట్టింపయ్యాయి. ఎందుకంటే నాలుగు నెలల విరామం. ఆ రెండు సర్జరీల తర్వాత నాలుగున్నర నెలలు విరామం తీసుకున్నాను. బహుశా ఫౌండేషన్‌లోని ప్రతి ఒక్కరూ నేను సెలవుల్లో ఉన్నానని అనుకొని ఉంటారు. అందుకని వాళ్ళు పనులను రెట్టింపు చేశారు. అలా నడుస్తోంది ఫర్వాలేదు.
కానీ ఈ దశ తర్వాత మీరు గమనించారా. సద్గురుకి ఏంటి బ్రెయిన్ సర్జరీ? సద్గురు అని పిలుస్తున్నప్పుడు. ప్రజలు బహుశా. అది ఆయనకి బ్రెయిన్ ఉంది కాబట్టి. వాళ్లకి బ్రెయిన్ లేదు అంతేకాదు వాళ్ళు ఈ ప్రపంచంలో జీవించరు. వాళ్ళు అద్భుతాలనే పిచ్చి ఊహల్లో బతుకుతుంటారు. వాళ్ళు వారి జ్ఞానంతో గానీ, తెలివితో గానీ జీవించరు. అందుకే వాళ్ళకి బ్రెయిన్ లేదని అంటున్నాను. కాబట్టే వాళ్ళు ఓ సద్గురు తల ఎలా పగలగలదు అనుకుంటారు. ఎవరైనా వాళ్ళ తలని బండకి కొట్టుకుంటే అది పగులుతుంది. నేను చెప్తున్నాను.
నేను ఒక ఆర్టికల్ చదివాను. అది వ్యంగ్యంగా, దేవుడిలాంటి సద్గురుకి బ్రెయిన్ సర్జరీ జరిగింది అని రాసింది. అలాంటివి చూసినప్పుడు వాటికి ఎలా స్పందిస్తారు? చూడండి అందులో స్పందించడానికి ఏముంది? కుక్కకి మొరగడం ఒక ఆనందం. ఒకవేళ. మీ వీధిలో ఒక కుక్క ఉంటే. ఒక దొంగ మీ ఇంటిని దోచుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నప్పుడు.
మీరు చేతిలో ఒక బిస్కెట్ పట్టుకొని వస్తే ఆ కుక్క తోక ఊపుతుంది. కానీ శివుడే ఆ వీధి గుండా నడిచి వస్తే, అది మొరుగుతుంది. అప్పుడు ఆ కుక్కను ఏం చేయగలరు? పాపం ఆ కుక్కకు తెలిసింది అదే ఫర్వాలేదు. కానీ ఫాలోవర్స్‌కి కూడా ఆ ప్రశ్న ఉండొచ్చు కదా అని అడిగాను. లేదు, లేదు. నాతో పరిచయం ఉన్నవాళ్ళు. నేను వాళ్ళకి చేసిన ఒక విషయం ఏంటంటే వాళ్ళు వివేకవంతులైన మనుషులుగా మారారు. ఎందుకంటే వాళ్ళు వివేకవంతులైన మనుషులుగా ఉండటం నాకు చాలా ముఖ్యం. చాలామంది మతం, ఫిలాసఫీ, సిద్ధాంతం పేరుతో వివేకం లేకుండా జీవిస్తున్నారు.
వాళ్ళని వివేకంలోకి తీసుకురావడమే నా పని. ఇంకా సద్గురు, ఒక మూడు, నాలుగు ఏళ్ల క్రితం ఒక వీడియో చూశాను. అలాంటి సంభాషణని ఎలా ఎదుర్కోవాలో తెలీదు కానీ. జావేద్ అఖ్తర్ గారిది, మీది థింక్ అనే ఒక ప్యానెల్ మీద ఒక చర్చ అవుతోంది. ఆయన నమ్మకాన్ని మూర్ఖత్వంతో పోల్చుతున్నారు. ఇంకా అలాంటి మాటలు మాట్లాడుతూ లేదా. ఆయన పదే పదే రెచ్చగొడుతూ మాట్లాడినట్లు అనిపించింది నాకు.
మీరు దాన్ని ఎలా తీసుకున్నారు లేదా. ఆ తర్వాత లేదా ఇప్పుడు దాన్ని ఎలా చూస్తారు? నేను దాన్ని ఎలా తీసుకున్నానో మీరే చూశారు కదా. మీరేమి మీ కంట్రోల్‌ని కోల్పోలేదు, మీరేమీ అనలేదు కూడా అక్కడ. కానీ ఎందుకో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు అనిపించింది. లేదు. చూడండి, నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకున్నాను అంటే. నేను ఏ మనిషికీ ఆ అధికారాన్ని ఇవ్వలేదు. వాళ్ళు నన్ను కలవరపరచే, బాధకు గురిచేసే, నిరాశపరచే. కోపానికి గురిచేసే స్వేచ్ఛను ఎవరికీ ఇవ్వలేదు.
కాబట్టి వాళ్ళు ఏం చేసినా పర్లేదు నేను చేయాల్సింది చేస్తాను. అంటే మీరు ఎప్పుడూ ఏ విధంగానూ మీ ప్రశాంతతని కోల్పోలేదని. లేదా మీరెక్కడా కంట్రోల్ మిస్ అవ్వలేదని. అంటే ఎక్కడా సీరియస్ అవ్వలేదని అనుకోవచ్చా? చూడండి, అలా కాదు. విషయం ఏంటంటే. నా లోపల ఏం జరగాలనేది దాన్ని నేను ఎరుకతో నిర్వహిస్తాను. మీరు గనక మీ ఆలోచనని, భావోద్వేగాన్ని ఎరుకతో నిర్వహించి ఉంటే. మీరు దాన్ని ఎలా ఉంచుకునేవారు? మీరు దాన్ని ఎలా ఉంచుకుంటారు? ఆహ్లాదకరంగానా లేక బాధతోనా? ఆహ్లాదకరంగానే. నేను చేసేది అదే. కానీ అది అంత సులభమా? అన్నది ప్రశ్న.
అవును. మీరు సుముఖంగా ఉంటే. మీ మేధస్సు పనిచేస్తుంటే. మీకు మేధస్సు సరిగ్గా పనిచేస్తుంటే. మీ మూర్ఖపు ఆలోచనలు ఇంకా నమ్మకాల వల్ల మీ మేధస్సు స్తంభించిపోయి ఉంటే. మీరు అలా మాట్లాడతారు. అలాగే, మీరు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని మీరు అనుకుంటున్నారా. సద్గురుగా మీకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయా. మీకు అలా అనిపిస్తుందా? చూడండి ఉనికి యొక్క స్వభావం ఎలాంటిదంటే. మీరు ఇక్కడ ఒక బిలియన్ సంవత్సరాలు జీవించినా.
చాలా తక్కువ తెలుసుకుంటారు. కానీ. మీరు అదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదు. ఎందుకంటే. ఆ విషయాల పట్ల మీకు ఆసక్తి ఇంకా సమయం కావాలి. ఇది ఎలా అంటే. చూడండి మనం ఒక హోటల్లో ఉన్నాం. ఈ హోటల్లో ఒక వెయ్యి గదులు ఉన్నాయనుకుందాం. మీరు మీ గదిని బుక్ చేసుకుంటే వాళ్ళు మీకు ఒక కీ కార్డు ఇస్తారు. దానితో మీరు కేవలం మీ గదిని మాత్రమే తెరవగలరు. కానీ క్లీనింగ్ పని చేసే పని మనిషి ఒకామె ఉంటుంది.
ఆమె దగ్గర ఒక కార్డు ఉంటుంది. అది ఆ అంతస్తులోని అన్ని గదులను తెరుస్తుంది. అయితే మేనేజర్ ఉన్నాడు కదా. అతని దగ్గర ఒక కార్డు ఉంటుంది. ఆయన ఆ ఒక వెయ్యి గదులన్నీ తెరవగలడు. అయితే ఆయన అవన్నీ చూశారా? యాదృచ్ఛికంగా ఆయన అది ఇది చెక్ చేస్తారు అంతే. అవసరాన్ని బట్టి. దాన్ని చూసి అతనికి సాధారణంగా హోటల్ ఎలా నడుస్తుందో తెలుస్తుంది. అదే విధంగా. మీరు గనక మీ ఎరుకని ఒక నిర్దిష్ట స్థాయికి పెంచుకుంటే. మీకు అన్నింటికీ తాళాలు ఉంటాయి.
కానీ మీరు వెళ్ళి అన్నింటినీ తెరుస్తారా? ఎందుకంటే ఇది వెయ్యి గదుల విషయం కాదు. ఈ విశ్వం అనేది. ఇందులో ట్రిలియన్ల కొద్దీ ఇంకా జిలియన్ల కొద్దీ గదులు ఉంటాయి. మీరు వెళ్ళి అవన్నీ చూస్తారా? లేదు ఎవరూ అవన్నీ చూడలేరు. సమయం లేదు. ఆసక్తి కూడా లేదు. మీకు తగినంత తెలుసు. ముఖ్యమైనవన్నీ మీకు తెలుసు అది చాలు. ఇంకా, నేను మీ పుస్తకం చదువుతున్నప్పుడు. ఏ పుస్తకం చదివారు? ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి నేను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో.
ఇంకా అది మాత్రమే కాదు. కొన్ని ఆర్టికల్స్ లేదా మీ ప్రయాణం గురించి వీడియోలు చూస్తున్నప్పుడు. 23 సెప్టెంబర్ 1982. చాముండి పర్వతాల మీద. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? ఆ జ్ఞానోదయం. మీరు తెలుసుకోలేరు. నేను మీకు చెప్పగలను కానీ మీరు తెలుసుకోలేరని చెప్తున్నాను. మీరు ఆ అనుభూతిని పొందితేనే తెలుసుకోగలరు అవునా కాదా? చాలా నిజం. మీరు అనుభూతి చెందని దేని గురించైనా తెలుసుకోగలరా? కచ్చితంగా లేదు. మీరు గులాబ్ జామున్ తినలేదనుకుందాం. మీకు దాని రుచి ఎలా ఉంటుందో వివరిస్తాను మీకు తెలుస్తుందా?
కాబట్టి అంత చిన్న విషయం కూడా తెలుసుకోలేనప్పుడు జ్ఞానోదయం గురించి ఎలా తెలుసుకుంటారు? కానీ అది జ్ఞానోదయం అని మీకెలా తెలిసింది. ఆ నిర్దిష్ట సమయంలో? నేను అది జ్ఞానోదయం అని చెప్పలేదు. ప్రజలు అది జ్ఞానోదయం అని అంటున్నారు. అంటే ఆ రోజు ఏం జరిగింది నేను అడగొచ్చా? నేను ఎలా పెరిగాను అంటే. నాకు 16, 17 ఏళ్ళ వచ్చేసరికి నేను ఒక తీవ్రమైన సంశయవాదిని. నేను చూసేది తప్ప మరేదీ నమ్మేవాడిని కాదు. 11, 12 ఏళ్ళ వయసుకే నేను భయంకరమైన నాస్తికుడిని. 12 ఏళ్ళ వయసుకే నేను మార్క్స్ ఇంకా ఎంగెల్స్‌లను చదివాను.
14 ఏళ్ళ వయసులో నేను సాయుధ పోరాటంలో చేరాలనుకున్నాను. అదృష్టవశాత్తూ కొన్ని విషయాలు తప్పుగా జరిగాయి. నా స్నేహితుల్లో కొందరు చేరి, అందులో చంపబడ్డారు. అవును. కాబట్టి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే. ఎందుకంటే నేను జీవితాన్ని చూసినప్పుడు. నాకు అన్నీ అన్యాయంగా కనిపించాయి. ప్రతిచోటా! ఏదో ఒక అన్యాయం జరుగుతూ ఉండేది.
మీరు అన్యాయం చూసినప్పుడు మీకు కోపం వస్తుంది. కాబట్టి నిత్యం కోపంతో ఉండేవాడిని ప్రత్యేకించి ఒకరి మీద అని కాదు. ఊరికే. సామాజిక వ్యవస్థలు ,రాజకీయ వ్యవస్థలు, మతపరమైన పిచ్చి అన్నీ. నేను ఎల్లప్పుడూ కోపంగా ఉండేవాడిని రగిలిపోతూ. మీరు నన్ను కూల్ అంటున్నారు కానీ రగిలిపోతూ ఉండేవాడిని. కాబట్టి అన్ని విషయాల గురించి పూర్తిగా సంశయవాదిని. నేను ఏ ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగలేదు. నేను ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నేను గుడికి వెళ్ళేది అది నిర్మాణపరంగా బాగుంటేనే.
లేదా అక్కడ ఏదైనా శక్తివంతమైనది ఉంటేనే. ఈ రోజు వరకు నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. కానీ మీ వీడియోలు చూస్తాము అక్కడ హారతి ఇచ్చి ఇవన్నీ చేస్తారు. అవి ప్రక్రియలు ప్రార్థనలు కాదు. ప్రార్థన అంటే వేడుకోవడం. దయచేసి నాకు ఇది, ఇది, ఇది సహాయం చేయండి అని చెప్పడం. ప్రియమైన దేవుడా ఇది చేయి అది చేయి. నాకు సహాయం చేయి నన్ను రక్షించు. నేను నా జీవితంలో అలా ఎప్పుడూ చేయలేదు. ఇవి ప్రక్రియలు ఇవి శాస్త్రబద్ధమైన ప్రక్రియలు. మీరు దీన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో చేస్తే అది ఒక నిర్దిష్ట శక్తిని సృష్టిస్తుంది.
దానివల్ల ప్రజలు ప్రయోజనం పొందగలరు. అది వేరే విషయం. సరే, నేను అలా ఉండేవాడిని. ఇంకా నేను ఎలాగో ప్రయాణించాలనుకున్నాను కాబట్టి. కొన్ని సంవత్సరాలు వ్యాపారం చేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. అరడజను వ్యాపారాల్లోకి దిగాను. అవన్నీ ఆ రోజుల్లో చాలా విజయవంతమయ్యాయి. నేను ట్రిలియన్ డాలర్ల సక్సెస్ గురించి మాట్లాడట్లేదు. కానీ, మైసూరు లాంటి చిన్న పట్టణానికి. నేను చాలా విజయవంతుడిని.
ఆ రోజులకి. ఆ క్షణం వరకు ఇది నేను అది మీరు అని అనుకున్నాను. నాకు మీతో ఏ సమస్యా లేదు కానీ అది మీరు ఇది నేను. ఉన్నట్టుండి ఏది నేను ఏది నేను కాదని నాకు తెలీలేదు. ఏదైతే నేను అని అనుకున్నానో అది అంతటా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మీరు ఎవరు అనేది మీ శరీరానికి పరిమితమైపోయింది. మీకు శరీరం ఎక్కడి నుండి వచ్చింది? మీరు ఇలా పుట్టారా? లేదు. ఇలా పుట్టారా? అవును.
మీరు ఇలా అయ్యారు ఎలా? బహుశా కాలం గడిచే కొద్దీ. ఓ కాలం మిమ్మల్ని ఇలా చేసిందా? మీరు తింటూ ఉన్నారు కదా. అవును, నేను తీసుకున్న ఆహారం వల్ల. కేవలం ఆహారం. ఆ తెలంగాణ ఆహారం అంతా. నెమ్మదిగా మిమ్మల్ని ఇలా చేసింది ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతి నుంచా? ఈ భూమ్మీదున్న మట్టి నుంచే కదా మీరు తింటున్నది. అవునా కాదా? సరే. ప్రస్తుతం. మీరు ఇక్కడ కూర్చున్నారు నేను సడన్‌గా ఇది నేను అంటే.
మీరు నేను పిచ్చివాడిని అనుకుంటారు కదా. ఇప్పుడు మీ గురించి అదే అనుకుంటున్నాను. ఎందుకంటే. మీ ప్లేట్లో ఆహారం కనిపించినప్పుడు మీరు ఇది నా ఆహారం అంటారు. మీరు తిని ఆ తర్వాత ఇది నేను అంటారు. పిచ్చి కాదా? అవును. కాబట్టి ఏదైతే మీరు అని అనుకుంటున్నారో అది శరీరానికి పరిమితమైపోయింది. ఎందుకంటే మీరు అలా ఆలోచిస్తారు. మీ అనుభూతి అంతా అలా పరిమితమైపోయింది. మీరు కనీసం ఊపిరి పీలుస్తున్నారా? నేను ఊపిరి పీలుస్తున్నాను.
మీరు ఊపిరి పీలుస్తున్నారు. కాబట్టి. మీరు శ్వాస వదిలితే. బయట ఒక చెట్టు ఉంది అది మీ శ్వాసను పీల్చుకుంటుంది. కరెక్ట్. అది గాలి వదులుతుంది మీరు దాని శ్వాసను పీల్చుకుంటారు. కాబట్టి ఏదైతే మీరు అని అనుకుంటున్నారో అది శరీరంలోనే ఉందా. లేక అది వ్యాపించి ఉందా? నేను దాన్ని రెండు విధాలుగా పరిగణించవచ్చు కదా? లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇలా వివరించొచ్చు. మీ ఊపిరితిత్తులలో సగం చెట్టు మీద వేలాడుతోంది. అవునా కాదా? అవును. అది అంతటా ఉంది. మీ ఆహారం ఎక్కడో ఎక్కడో పండుతోంది.
మీరు అది అంతటా ఉంది మీ శరీరం అంతటా ఉంది. అవునా కాదా? ఈ శరీరం కూడా చాలా చోట్ల నుండి వచ్చింది అవునా కాదా? కాబట్టి. ప్రాథమికంగా మీరు ఏదైతే నేను అని అనుకుంటున్నారో. అది మీ భావన. జీవం అలా ఉండదు. జీవం ప్రతి దానితో అనుసంధానమై ఉంటుంది. పరమాణువు స్థాయిలో కూడా అది మొత్తం విశ్వంతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి. మీరు మానసిక ప్రక్రియ నుండి కొంచెం దూరం ఏర్పరచగలిగితే.
అప్పుడు ఉన్నట్టుండి మీరు అనేది అంతటా ఉండటాన్ని చూస్తారు. ఇది నాకు జరిగినప్పుడు. అది కేవలం 10, 15 నిమిషాలు మాత్రమే అనుకున్నాను. కానీ నేను సాధారణ స్థితికి వచ్చినప్పుడు చూసుకుంటే. అలా నాలుగున్నర గంటలు ఉండిపోయాను. నా యుక్తవయసులో మొదటిసారిగా, నాకు కన్నీళ్లు వచ్చాయి. నేనూ, కన్నీళ్లు అసంభవం. అప్పటి వరకు. అవును. కన్నీళ్ళు అంతటా. నా చొక్కా తడిచి పోయింది. నా శరీరంలోని ప్రతీ కణం పారవశ్యంతో ఉప్పొంగుతోంది. దాన్ని మాటల్లో వర్ణించలేము.
నేను ఎప్పుడూ శాంతంగా, సంతోషంగా ఉండేవాడిని అది సమస్య కాదు. యువకుడిని, జీవితం బాగుండేది అందరూ చప్పట్లు కొడుతున్నారు. నా సమస్య ఏంటి? అంతా బాగానే ఉంది కానీ ఇది వేరు. శరీరంలోని ప్రతీ కణం అలా కరిగిపోతోంది. నా దగ్గర సమాధానం లేదు నాకు దీని గురించి ఏమీ తెలీదు. నాకేం జరుగుతోంది అని నా మనుసుని అడిగినప్పుడు. నువ్వు అదుపు తప్పిపోతున్నావ్ సమాధానం వచ్చింది. నా స్నేహితుల్ని "నాకేం జరుగుతోంది?" అని అడిగితే. ఆ నిజం చెప్పు, నువ్వు ఏదో డ్రగ్ తీసుకున్నావు కదా. కొండ మీద మష్రూమ్స్ ఏమైనా దొరికాయా వాళ్ళు అడగగలిగింది ఇవే.
కాబట్టి దీని గురించి ఏమీ తెలీదు. కానీ బంగారు గని దొరికిందని నాకు తెలుసు. నేను దాన్ని కోల్పోవాలనులేదు. ఆరు వారాల్లో అది స్థిరపడింది నేను అలా జీవించడం మొదలుపెట్టాను. నా వ్యాపారాలన్నీ ఎక్కడి వాటిని అక్కడే నా భాగస్వాములకి వదిలేశాను. అలానే. వాళ్ళ నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా. దాన్ని అక్కడే వదిలేశాను. ఎందుకంటే అందులో ఏమీ లేదు, అది కేవలం. అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్నారా? అవును కన్స్ట్రక్షన్. నేను కోళ్ళఫారం, ప్రజల కోసం ఫామ్స్ కడుతుండేవాడిని.
ఇంకా వేరే ఇతర పనులు. కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇతర వ్యాపారాలు. కాబట్టి మీరు అన్నింటినీ అక్కడే మీ పార్ట్నర్స్కి వదిలేశారా? అవును ఎందుకంటే అది కేవలం. అదంతా చూసుకునే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అతను లేడు ఉన్నట్టుండి ఆ తెలివైన యువకుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ పూర్తి శూన్యం. ఓకే. కానీ అద్భుతంగా ఉంది. అంటే మీరు మోసపోయారా? మీరు మోసపోయారా? లేదు. ఎగిరిపోయాను.
అలా ఏడాది, ఏడాదిన్నర కాలం పాటు కేవలం ప్రయాణించాను. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు. భారీ మొత్తంలో జ్ఞాపకాలు. నాకు దానితో ఏ సంబంధం లేనిది వచ్చింది. అది నిజమో కాదో తెలుసుకోవడానికి చాలా తిరిగాను. సరే అది పగటి వెలుగులా స్పష్టంగా ఉంది. కానీ నా సంశయ బుద్ధి సహజంగా అన్నింటినీ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత కొన్ని వారాల్లో. కొన్ని నెలల్లో. నాకు ఇది అర్థమైంది. నాకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని.
సులభమైన విషయం ఏంటంటే మీరు ఊరికే కూర్చోగలిగితే. మీ మనసుని పక్కన పెట్టి ఊరికే అలా కూర్చుంటే. మీ శరీరంలోని ప్రతీ కణం పారవశ్యంతో ఉప్పొంగుతుంది. ఇవాళ మన దగ్గర గణనీయమైన శాస్త్రీయ ఆధారాలున్నాయి. బెత్ ఇజ్రాయెల్ హాస్పిటల్లో మాకు ఒక సెంటర్ ఉంది. అది హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు టీచింగ్ హాస్పిటల్. అక్కడ మేము బోధించే సరళమైన సాధనతో కొద్ది వారాల వ్యవధిలోనే రసాయనికత ఎలా మారుతుందో. చూపే అధ్యయనాలు జరిగాయి. మీరు చదువుతున్న ఇన్నర్ ఇంజనీరింగ్ పుస్తకం. దయచేసి ప్రోగ్రామ్ చేయండి. అందులో ఒక సరళమైన 21 నిమిషాల సాధన ఉంటుంది.
ఆరు నుండి ఎనిమిది వారాల్లో మీ ఆనంద కారకం పెరుగుతుంది. గణనీయంగా. 70% పైగా పెరుగుతుంది. ఇంకా సుమారు 12 వారాలలో. లైంగిక భావప్రాప్తిలో జరిగే దాని కంటే. ఆనంద కారకం 23% ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఇంకా సగటున మూడు నెలల సాధన తర్వాత. సగటున. చాలామంది మునుపటి కంటే ఆరున్నర సంవత్సరాలు చిన్నవాళ్ళుగా అవుతున్నారు. కణాల స్థాయిలో. కాబట్టి ఇవన్నీ బాగా నిరూపితమైన శాస్త్రీయ గణాంకాలు.
ఇవన్నీ నాకు జరిగాయి. వాళ్ళు చెప్తున్న స్థాయిలో కాదు ఒక అపారమైన స్థాయిలో. నాకు కొన్ని గంటల్లోనే జరిగింది. ఇంకా నాకు అర్థమైంది ఏమిటంటే మీరు మీ మానసిక కార్యకలాపాలని ఇక్కడే వదిలేసి. ఊరికే కూర్చోండి. అంతే. అది అంత సులభం అని నాకు అర్థమైనప్పుడు. అప్పుడు నాకు 25 ఏళ్ళు. ప్రపంచ జనాభా అప్పుడు 4.62 లేదా 4.82 బిలియన్లు అలా ఉండేది.
నేను కూర్చొని ఒక ప్రణాళిక వేసుకున్నాను. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో. మొత్తం ప్రపంచాన్ని ఆనందమయం చేస్తాను అని. ఎవరికీ ఇది వద్దు చెప్పండి. దీనికి ఏ ఖర్చూ లేదు. మీరు కూర్చుంటే చాలు అది జరుగుతుంది. ఎవరికి వద్దు చెప్పండి. వాళ్ళు శాంతంగా, సంతోషంగా ఉండటానికి అన్ని రకాల పిచ్చి పనులు చేస్తున్నారు. నేను వారికి ఒక మార్గాన్నిబోధించగలను దానితో వారి కెమిస్ట్రీ ఆనందమయం అవుతుంది. చూడండి 43 సంవత్సరాలు. ఇంకా కొనసాగుతోంది. వారానికి ఏడు రోజులు 365 రోజులు. కానీ ప్రజలు వారి బాధలకి కట్టుబడి ఉన్నారు.
మీరు నిన్న చూసి ఉండాలి ఆ ఈవెంట్ ఎక్స్టసీ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్. నేను వీడియోలు చూశాను. మీరు వీడియో చూశారా? ఓకే. వాళ్ళని అడగండి వాళ్ళ అనుభవం ఏంటి అని వాళ్ళు మంత్రముగ్ధులయ్యారు. ఏం చేయడం ద్వారా? ఏం చేసి అంటే. నేను వాళ్ళని అడగాలనుకున్నాను. "మీరు ఎందుకు ఏడ్చారు?" అని. లేదా మీ కళ్ళలో నీళ్ళు ఎందుకు వచ్చాయని అడుగుదాం అనుకున్నాను. కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఏడవడం అనకండి నేను ఏడవలేదు. కాదు, మీరు కాదు. నేను వాళ్ళని అడగాలనుకున్నాను. ఎవరైనా సరే. వాళ్ళు ఏడవట్లేదు. ఏదైనా, చూడండి. సమస్య ఏంటంటే, ఇప్పుడు చాలామంది కన్నీళ్ళు అనగానే, అవి ఏదో నొప్పి లేదా బాధ వల్ల వస్తాయనుకుంటారు.
కన్నీళ్ళు బాధ వల్ల రావు. ఏదైనా అనుభవం ఒక నిర్దిష్ట పరిమితిని దాటినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మీరు చాలా ఆనందాన్ని అనుభవిస్తే కన్నీళ్ళు వస్తాయి. మీరు చాలా ప్రేమను అనుభవిస్తే కన్నీళ్ళు వస్తాయి. పారవశ్యం, కన్నీళ్ళు వస్తాయి. ఇక నొప్పి, బాధ, ఏదైనా సరే. చాలామందికి కేవలం నొప్పి మాత్రమే ఆ పరిమితిని దాటుతుంది. వాళ్ళ ఆనందం, వాళ్ళ శాంతి వాళ్ళ ప్రేమ ఆ పరిమితులను ఎప్పుడూ దాటవు. ప్రేమ, ఆనందం మరియు పారవశ్యంతో మీ చెంపలు కన్నీళ్లతో తడవకపోతే.
మీరు ఇంకా జీవించడం మొదలుపెట్టలేదనే. అవును. ఓకే. సద్గురు నాకు ఒక ఆలోచన వచ్చింది. రీసెంట్గా మేము మీతో ఒక పాడ్‌కాస్ట్ చేయబోతున్నామని తెలిసినప్పుడు. ముందుగా మీరు ఇచ్చే సాధనాలను గానీ. మీరు ఇచ్చే సమాచారాన్ని గానీ ఒకసారి వినియోగిద్దామని అనుకున్నాను. ఇంకా ఈశా టీమ్ నుండి కొంతమంది ఆఫీస్‌కి వచ్చారు. మా టీమ్ అంతా 'మిరాకిల్ ఆఫ్ మైండ్' అనే యాప్‌ని అనుభూతి చెందారు.
దానితో మేము ఏడు నిమిషాల ధ్యానం చేశాము. నిజాయితీగా చెప్పాలంటే మేము చేసిన ధ్యానం తర్వాత. ఇది దేనినీ ప్రచారం చేయడం కోసం చెప్పడం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి ధ్యానాన్ని అనుభూతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిన ప్రాథమిక విషయం అని నాకు అనిపించింది. అయితే ధ్యానం లేదా యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇంకా యోగా కేవలం శారీరకమైనదేనా? ఇంకా మానవ మెదడు లేదా శరీరం యొక్క శక్తి. లేదా సామర్థ్యం ఏమిటి అని నేను సూటిగా అడగొచ్చా?
చూడండి, ఈ భూమ్మీదున్న అన్ని జీవులకు. ప్రకృతి రెండు గీతలు గీసింది. వాటి మధ్యే అవి జీవించి మరణిస్తాయి. మానవుడికి మనిషిగా ఉండటం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పై గీత లేదు. మీరు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళవచ్చు. కానీ చాలామంది ప్రజలు. చూడండి మీరు ఒక చిలుకని పంజరంలో పెట్టి దానికి బాగా తినిపిస్తే.
కొంతకాలం తర్వాత మీరు తలుపు తెరిచినా అది వెళ్ళదు. ఎందుకంటే అది లావైపోయింది. ఇంకా దానికి తెలుసు ఉచిత ఆహారం ఇక్కడికి వస్తుందని. అది ఎగరడం మర్చిపోయింది అది ఎగరదు. అది ఎగిరితే. దానికి తెలుసు పక్షిగా అది చేయగల ఉత్తమ పని అదే అని. కానీ. అది పంజరంలో సోమరిగా మారుతుంది మీరు తలుపు తెరిచి ఉంచినా అది వెళ్ళదు. చాలామంది మనుషులు ఇలా అయిపోయారు. వాళ్ళు వారి పూర్తి లోతుని అన్వేషించట్లేదు.
ఎందుకంటే వారి పిచ్చి భద్రతా కారణాల వల్ల. అంతా భద్రత గురించే. అందరూ ఎందుకు చదువుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? చదువుతున్న సబ్జెక్టుల మీద ఆసక్తి వల్ల అనుకుంటున్నారా? ఉద్యోగం వస్తుంది డబ్బు సంపాదిస్తారు ఇక భద్రతతో ఉండొచ్చు అనుకుంటారు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? పెళ్లికి ముందు జాతకం ఎందుకు చూస్తున్నారు? భద్రత అంతా భద్రత గురించే. జీవితానికి భద్రత ఉండదు.
జీవిత స్వభావమేమిటంటే అది అనూహ్యమైనది. అనూహ్యమైన దాన్ని మీరు ఊహించగలిగేలా చేయాలనుకుంటున్నారు. ఇదే తేడా. చూడండి, ఏదైనా పునరావృతం అవుతుంటే దాన్ని ఊహించగలం. అది ఇలానే వెళ్తుంది. ఇది భౌతికత యొక్క స్వభావం. భౌతికమైన ప్రతీదీ ఇలానే వెళ్తోంది. ఒక అణువు ఇలా వెళ్తోంది సౌర వ్యవస్థ ఇలా వెళ్తోంది. విశ్వం ఇలా వెళ్తోంది. భౌతికమైన ప్రతీదానికీ ఒక పునరావృతమయ్యే కదలిక కావాలి.
అదే ట్రాక్‌లో అది వెళ్ళాలి. అది భౌతికత. విశ్వంలో భౌతికత అనేది ఏదో ఒకదాని నిరంతర చలనం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి మీరు మిమ్మల్ని మీ భౌతిక స్వభావానికి మాత్రమే పరిమితం చేసుకుంటే. మీరు అలానే ఉంటారు. కొత్తగా ఏమీ జరగదు. మీరు సాహసంతో చనిపోతారా లేదా విసుగుతో చనిపోతారా అనేది మీ ఇష్టం. కాబట్టి, ప్రజలు ఎప్పుడూ భద్రత కోసం చూస్తున్నారు.
కానీ భద్రత అనేది లేదు. మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉన్నా మీ సంపద ఎంత ఉన్నా. మీరు రేపు చనిపోవచ్చు నేను మిమ్మల్ని దీర్ఘాయుష్షుతో ఆశీర్వదిస్తాను. కానీ అది సాధ్యమే. హలో? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఇది జరుగుతోంది అవునా కాదా? నిజం, నిజం. యుద్ధం ఉండటం వల్లనో లేదా ఇంకేదో ఉండటం వల్లనో కాదు. ఇది వేల రకాలుగా జరగవచ్చు ఇది ప్రతిరోజూ జరుగుతోంది. కాబట్టి అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే మనుషులు. ప్రతిరోజూ చుట్టూ ఉన్న ప్రజలు చనిపోతున్నా.
వాళ్ళు కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నారు. ఇంకా వాళ్ళు ఈ నమ్మకంతో ఉంటారు ఇతరులు మాత్రమే చనిపోతారని. లేదు, లేదు మనమిద్దరం కూడా చనిపోతాం. అవునా కాదా? అవును. నేను బానే ఉన్నాను, పక్కనోడు పోతున్నాడులే అనే అనుకుంటారు. మనం ఎప్పుడూ ఇతరులు మాత్రమే చనిపోతారని అనుకుంటాం. లేదు, లేదు మనమందరం చనిపోతాం. మీరు చనిపోతారనే అవగాహన మీకుంటే. మీరు ఇక్కడ కొంతకాలం పాటు మాత్రమే ఉంటారని తెలుసుకున్నట్లు. మీ సమయం పరిమితం అని మీకు తెలిస్తే.
మిమ్మల్ని మీరు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటూ. మరింత మంచి జీవితాన్ని, వివేకవంతమైన జీవితాన్ని గడుపుతూ. ఇకపై అనవసరం అనిపించే పనులను చేయడం మానేస్తారా లేదా? లేదా మీరు అమరులని భావించి జీవిస్తే మీరు అన్ని రకాల పిచ్చి పనులు చేయడానికి సమయం ఉంటుంది. అదే జరుగుతోంది. చాలామంది వాళ్ళు చేయాలనుకున్నది చేయట్లేదు. ఇక్కడ ఎవరైనా బాధగా ఉండాలనుకుంటున్నారా? ఎవరూ బాధగా ఉండాలనుకోరు కానీ, అందరూ బాధని అనుభవిస్తారు ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి అనంతమైన సమయం ఉందని వాళ్ళు అనుకుంటారు.
ఇక్కడ గడిచిపోతున్నది సమయం కాదు జీవితం అని వాళ్ళకి తెలిస్తే. మీరు దాని పట్ల ఎరుకతో ఉంటే. మీరు ఒక్క క్షణం కూడా మీకు అనవసరమైన పనిని చేయరు. అవునా? అది ముఖ్యం. మరణం పట్ల ఎరుక. చాలాసార్లు నేను ఎవరితోనైనా మీ ప్రసంగాలు గురించి గాని. మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానాల గురించి గాని. మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు గమనిస్తే.
ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. అయితే ఒకటి నన్ను ఆకట్టుకుంది లేదా నేను నాకు అన్వయించుకోగలిగినది ఏంటంటే. కొన్నిసార్లు సాధారణంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు. వాళ్ళ మాటలు అర్థం కావడం వేరు భాష రావడం వల్ల. వాళ్ళ మాటలను ఒప్పుకోవడం వేరు. లేదా మీ, దాన్ని ఏమంటారు. వివరించే విధానం వేరు ఇంకా మీరు చెప్పేదాన్ని నమ్మడం వేరు. కాబట్టి ఆ మధ్యలో ఆగుతున్నారేమో అనిపిస్తుంది. అర్థం కావడానికి ఒప్పుకోవడానికి మధ్యలో ఆగిపోతున్నారు. ఇది లాజిక్ లేకపోవడం వల్లనా లేదా స్పష్టత లేకపోవడం వల్లనా. లేదా అర్థం చేసుకోలేకపోవడం వల్లనా మీకేమనిపిస్తుంది?
ఎందుకంటే నేను మీ వీడియోల కింద చాలా కామెంట్లు చూశాను. ఎన్ని పాజిటివ్‌గా ఉంటాయో కొన్ని నెగటివ్‌గా ఉంటాయి. లేకపోతే. లేదు కొంతమంది దానికి కట్టుబడి ఉన్నారు. నేను ఏం చెప్పినా నేను ఈ రోజు సోమవారం అంటే. వాళ్ళు నన్ను తిడతారు ఇది సోమవారం కాదు అని. అలాంటి ప్రజలు ఉన్నారు దేశంలో స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు వేరే వేరే కారణాల కోసం అక్కడ ఉన్నారు ఫర్వాలేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే. వాస్తవాలను తప్పు పట్టడానికి చూసినా కూడా వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు.
కానీ. లేదు, లేదు. విషయమేమిటంటే. వాళ్ళు వారి సొంత మూర్ఖపు అభిప్రాయాలతో చాలా కలుషితమైపోయారు. ఎవరిపైనా, దేనిపైనా ఎలాంటి అభిప్రాయాలు లేకుండా కూడా ఒక వ్యక్తి ఉండగలరని. వాళ్ళకు అర్థం కాదు. నాతో 20-30 సంవత్సరాలుగా జీవిస్తున్న ప్రజల మీద కూడా. నాకు ఏ అభిప్రాయాలూ లేవు. మీకు తెలుసా అది ఎంత కష్టమో మీరు ఎంత పని చేయాలో. మీ మనసుని ఎంత క్రమశిక్షణలో పెట్టాలో. మీ చుట్టూ ప్రతిరోజూ ఉండే మీరు చూసే ప్రజల మీద అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఉండటానికి?
నాకైతే అది ఊహించలేనిది. నా చుట్టూ ఉన్న ప్రజల మీద నాకు ఏ అభిప్రాయాలూ లేవు. అది తెలుసా? అది కుటుంబం అయినా, స్నేహితులు అయినా, లేదా నాతో పనిచేసే వాలంటీర్లు అయినా. నేను వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారో అలా చూస్తాను. పని విషయాల్లో మాత్రం మీకు కొన్ని నిర్ధారణలు ఉండవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇది చేయగలడు ఆ వ్యక్తి అది చేయలేడు. అది వేరే విషయం కానీ మనుషులుగా. నేను వాళ్ళని చూసినప్పుడు నేను వాళ్ళని కేవలం ఒక జీవంగా చూస్తాను. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా.
ఎందుకంటే. మానవుడిగా ఉండటం అనేది ఒక సంభావ్యత అదొక ఉత్పత్తి కాదు. కానీ వాళ్ళందరూ దేనికో ఒకదానికి ఉత్పత్తులుగా మారిపోయారు. అందుకే నేను కూడా ఒక ఉత్పత్తిగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. మీరు అడిగిన మొదటి ప్రశ్న కూడా అదే నన్ను నేను ఎలా నిర్వచించుకోవాలి? అని. నేను నన్ను నిర్వచించుకోను నేను నన్ను ఎందుకు నిర్వచించుకోవాలి? నిర్వచనం ఒక పరిమితి. నేను నా మీద ఎప్పుడూ పరిమితి పెట్టుకోను. నేను అవసరమైనది చేస్తున్నాను కానీ రేపు నేను పూర్తిగా ఇంకేదైనా చేయవచ్చు. అయితే మీరు ఎవరి మీదా అభిప్రాయం ఏర్పరచుకోను అన్నప్పుడు.
మీరు వాళ్ళు అలా ఉన్నారని వాళ్ళు కలుషితమయ్యారని. లేదా వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయని కూడా చెప్తున్నారు అది కూడా ఒక అభిప్రాయమే కదా? ఏంటది? మీరు అంటున్నది. మీరు ఏదైనా జనరలైజ్ చేస్తుంటే. అది వాస్తవం. ఈ రోజు సోమవారం అది వాస్తవమా లేక నా అభిప్రాయమా? అది వాస్తవం. అంతే ఎవరైనా వాళ్ళ నిర్ధారణలు చేసుకుంటున్నారని చూసినప్పుడు. నేను చెప్తాను వాళ్ళు వాళ్ళ నిర్ధారణలు చేసుకుంటున్నారని. దీనర్థం రేపు వాళ్ళు అవే నిర్ధారణలు చేసుకుంటారని కాదు. ఎందుకంటే నా పని ప్రజలను మార్చడం. వాళ్ళ మీద నిర్ధారణలు చేయడం కాదు. నేను మీరు ఇలానే ఉంటారు అని నిర్ధారిస్తే.
అప్పుడు రేపు ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని ముందుకు నడిపించడం ఎలా సాధ్యం? నేను మీరు ఒక సంభావ్యత అని చూసినప్పుడు మాత్రమే. ఈ రోజు మీరు ఇలా ఉన్నారు కానీ అది ఒక స్థిరమైన విషయం కాదు. ఇంకా మీరు ఇందాక అంటున్నట్టుగా. దానికి కట్టుబడి ఉన్న వాళ్ళు. లేకపోతే వేరే ప్రయోజనాలు ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్నారు అని. వాళ్ళవి స్వార్థ ప్రయోజనాలు. అదే. నేను ఏం చెప్పినా సరే మీరు కావాలంటే చూసుకోండి. అదే. అక్కడ నేను గమనించింది ఒకటి ఉంది. నేను చెప్తాను. మీరు కొన్ని ప్రశ్నలు అడగడానికి సంకోచిస్తున్నారని తెలుసు.
కాబట్టి నేనే చెప్తాను. లేదు లేదు, నాకు ఏ సంకోచం లేదు. కానీ కొన్ని ఉన్నాయ్ అడుగుదామని. నేనే దాన్ని లేవదీస్తాను. ఎందుకో. చూడండి. ఒక మనిషి చేయగల, చేయలేని ప్రతీ దానికి నన్ను నిందించారు. దానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? లేదు. ఊరికనే. నేను వేల ఎకరాల అడవిని తీసుకున్నాను వాళ్ళు ఒక్క అంగుళం చూపించమనండి. ఎలిఫెంట్ కారిడార్లు. ఒక్క అంగుళం సరేనా? ఎలిఫెంట్ కారిడార్లను కేంద్ర ప్రభుత్వ వన్యప్రాణి విభాగం లాంటివి నిర్ణయిస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ లేదా కేంద్ర సంస్థ గానీ. లేదా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గానీ. లేదా మిగతా సంస్థలు ఏవైనా నాకు పేర్లన్నీ తెలియవు. ఎవరైనా మేము ఎలిఫెంట్ కారిడార్లలో ఉన్నామని చెప్పారా? ఎవడో ఒక వెధవ ఏనుగుల కారిడార్ అని అంటున్నాడు. ఎందుకంటే వాడు అలాంటి పదం విన్నాడు వాడికి ఏనుగుల కారిడార్ అంటే ఏంటో తెలీదు. ఓకే? ఏనుగుల కారిడార్ అంటే ఏంటంటే. రెండు ఆవాసాలు ఉంటాయి. అవి ఒకదాని నుండి ఇంకొకదానికి వెళ్లాలనుకుంటాయి. సాధారణంగా 50 నుండి 100 కిలోమీటర్ల వెడల్పున్న కారిడార్ ఉంటుంది.
మా చుట్టూ అలాంటి కారిడార్ ఎక్కడా లేదు. దగ్గర్లోని కారిడార్ సుమారు 120 లేదా 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడా లేకపోతే మొదటి నుంచా? ఎప్పుడూ. అది సడన్‌గా జరగదు. అది నిన్న ఉండి రేపు పోదు అలాంటిదేమీ లేదు. వాళ్ళు మీ మీ ఫిల్మ్ స్టార్స్‌లో కొందరు కూడా నన్ను ఈ ప్రశ్న అడిగారు. నేను, రండి, అన్నాను నేను మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాను. నాకు ఒక్క అంగుళం చూపించండి నేను అదృశ్యమైపోతాను.
మీరు నన్ను మళ్ళీ చూడరు. ఇప్పుడు లేదు కానీ సద్గురు ఎంతో శక్తివంతుడని. ఆయన చట్టాన్ని కూడా మేనేజ్ చేయగలడని అంటారు. అదే నేను చెప్తున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. హైకోర్టులో మూడుసార్లు సమర్పించింది. ఏ విధమైన ఆక్రమణ లేదని. ఇంక మీరెవరు? ఒక్క అంగుళం కూడా ఆక్రమణ లేదు. ఒక్క అంగుళం ఉన్నా నేను వెళ్ళిపోతాను మీరు నన్ను మళ్ళీ చూడరు. నేను చెప్పిన ఏ విషయం నుంచీ నేను వెనక్కి వెళ్ళలేదు.
దీనికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, రండి. ఒక్క అంగుళం నేను వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు అది అసంబద్ధం. ఎందుకంటే వాళ్ళు సమర్పించారు. కాబట్టి మేము అన్ని రకాల సర్వేల కోసం పిలిచాం ప్రతీ సర్వే జరిగింది. నేను అంత పిచ్చివాడినని అనుకుంటున్నారా? ప్రపంచంలో ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు మీకు బహుశా తెలీదేమో. ప్రపంచవ్యాప్తంగా ఎంత పని జరుగుతుందో. లేదు, గణాంకాలున్నాయ్. నేను ఇంత చేస్తున్నప్పుడు, అడవి నుండి అదనంగా 10 అడుగుల భూమిని తీసుకొని. దీన్నంతటిని నాశనం చేస్తానా? అంత పిచ్చివాడిననుకుంటున్నారా? అంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా?
మరి? ఎందుకలా అంటున్నారు? స్పష్టంగా స్వార్థ ప్రయోజనం కోసం అవునా? మేము ఓ మార్కెటింగ్ ఏజెన్సీని నడుపుతాము. అయితే మాకు ఒక వైఖరి అర్థమైంది. అది కరెక్టో కాదో ఖచ్చితంగా తెలీదు. శివరాత్రికి రెండు రెండున్నర నెలల ముందు నుంచి. ప్రతీసారి మొదలవుతుంది. అయితే మేము కరెక్టే, ఒక రకమైన క్యాంపెయిన్ మొదలవుతుంది. ఇంకా ఎక్కడో చదివాను మీకు వ్యతిరేకంగా నెలకు 60 కోట్లు అలా ఖర్చు చేస్తున్నారట. సద్గురు జైల్లో ఉన్నారని ఓ ఫోటో. అవును. ఎందుకు? అంటే అంత క్రూరత్వం ఎందుకు?
నేను చెప్తున్నాను. నేను చెప్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా నా మీద ఒక పిచ్చి వ్యాఖ్య చేసింది. దాన్ని నేను తర్వాత సవాలు చేశాను. చూడండి. ఇద్దరు అమ్మాయిలు మిస్సయ్యారని అన్నారు. వీళ్ళు అమ్మాయిలు కాదు ఒకరికి 39 ఇంకొకరికి 43. సరేనా? వాళ్ళు ఆశ్రమంలో 12 సంవత్సరాలుగా ఉన్నారు ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు. తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని చూస్తున్నారు. వీళ్లు ఇంటికి వెళ్లి వస్తున్నారు అంతా జరుగుతోంది. సడన్‌గా ఆస్తి సమస్య ఏదో వచ్చి వాళ్ళు హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తారు. నేను చూశాను అది.
ఆ అమ్మాయిలు హాజరయ్యారు. హైకోర్టులో. అయిపోయిందిగా? హెబియస్ కార్పస్ అంటే ఏంటి? మిస్సింగ్. వాళ్ళు కనిపించారు అయిపోవాలి. కానీ అది అయిపోలేదు. ఆశ్రమాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. చూడండి, ఎవరినంటే వారిని ఇన్వెస్టిగేట్ చేయలేరు కేవలం నేరం గురించే ఇన్వెస్టిగేట్ చేయగలరు. నేరం లేనప్పుడు ఏం ఇన్వెస్టిగేట్ చేస్తారు? కానీ, 150 మంది పోలీసులు ఆశ్రమానికి వచ్చారు. ఏం ఇన్వెస్టిగేట్ చేయాలని? ఆశ్రమానికి గేటు కూడా లేదు. సరే, లోపలికి రండి, సమస్యేముంది?
ఏం కనుగొంటారు? ఏం లేదు కేవలం మీడియా కోసం. ఏదో జరుగుతోందని అప్పుడు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు ఆ అమ్మాయిలను పిలిచింది వాళ్ళు ఆన్లైన్లో హాజరయ్యారు. ఇంకా ఆ చీఫ్ జస్టిస్ వాళ్ళతో మాట్లాడారు. ఆయన సంతృప్తి చెందారు, ఏం లేదు అన్నారు. ఆ తర్వాత. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ కూడా దురదృష్టవశాత్తూ ఇలాగే నడుస్తోంది. ఈ వ్యాఖ్యకి నేను ఇబ్బందుల్లో పడొచ్చని నాకు తెలుసు. కానీ అంటాను, ఫర్వాలేదు. వాళ్ళు, ఏమీ లేదు దీనిలో ఏ నిజం లేదు. ఆ అమ్మాయిలు వారి సొంత ఇష్టంతో అక్కడ ఉన్నారు, అన్నారు.
వాళ్ళు బాగా చదువుకున్న వారు ఏదో బ్రెయిన్ వాష్ అయిన పిచ్చి వాళ్ళు కాదు. వాళ్ళు బాగా చదువుకున్న వారు ఒకరు ఎం.ఎస్.సి. ఇంకొకరు పీహెచ్డీ. ఇలా. కాబట్టి. ఆయన, దీనిలో ఏమీ లేదు కేసు కొట్టివేయబడింది. కానీ పోలీసులు క్రిమినల్ కేసులను విచారించవచ్చు, అన్నారు. అప్పుడు నేను ఏ క్రిమినల్ కేసులు? అన్నాను. ఫౌండేషన్ గానీ నేను గానీ నా జీవితంలో నా మీద ఎప్పుడూ క్రిమినల్ కేసు లేదు. నా జీవితం మొత్తంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్‌కి గానీ కోర్టుకి గానీ వెళ్ళలేదు.
ఇంకా ఫౌండేషన్ మీద ఎప్పుడూ ఏ నేరం ఆరోపించబడలేదు. ఓకే? అలాంటప్పుడు క్రిమినల్ కేసులు అంటున్నారేంటి? ఊరికే, బ్యాలెన్స్ చేయడానికి. ఏంటి మీరు చేసే పిచ్చి బ్యాలెన్స్? ఇప్పుడు సగం దేశం మా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయనుకుంటుంది. అది ఎలా నిలుస్తుంది? దురదృష్టవశాత్తూ విషయాలు ఇలాగే నడుస్తున్నాయి. అది నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టదు. కానీ అది పనికి ఆటంకం కలిగిస్తుంది. ఏంటి క్రిమినల్ కేస్? ఒక క్రిమినల్ కేసు చూపించండి. ఏమీ లేదు, ఊరికే.
అన్ని ఫైల్స్ తెరిచి చూడొచ్చు కదా? మా లీగల్ ఫైల్స్ ఉన్నాయి చూడండి దేని గురించైనా ఏదైనా క్రిమినల్ కేసు ఉందా? లేదు, కానీ మీరు అనేస్తారు. విషయం ఇది. నేను, మీరు ఒక రేపిస్ట్ అని అంటే. ఇలా అని, ఇలా రాస్తూ పోతాను. ఈ గదిలో మీరు తెలిసిన వాళ్ళెవ్వరు నమ్మరు. కానీ మీరు తెలీని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బహుశా అయ్యుండొచ్చు అనుకుంటారు. బహుశా. సంభావ్యత. దాంతో మనకు తెలీదు ఆయన రేపిస్ట్ అయ్యుండొచ్చు కాకపోవచ్చు.
ఆయన దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది అంతే. వాళ్ళు చేయాలనుకున్నది అదే. ఎందుకంటే, ఇది అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్‌లో 17% మాదే. నిజానికీ మాకు మద్దతు ఇవ్వాలి. మేము కోయంబత్తూరుని అంతర్జాతీయ పటంలో పెట్టాం. సరేనా? కానీ లేదు ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో విజయం నచ్చదు. విఫలమైన ప్రాజెక్టులు నచ్చుతాయి. విజయవంతమైన ప్రాజెక్టులు నచ్చవు.
అది పెద్ద స్టేట్మెంట్. అవును నిజం. ప్రజలు ఇక్కడ వ్యాపారాలు నడుపుతున్న ప్రజలు ఉన్నారు వాళ్ళని అడగండి. విజయవంతం కావాలంటే ప్రతిరోజూ ఎన్ని సమస్యలు ఎదురౌతాయో. అదే మేము యునైటెడ్ స్టేట్స్లో ఒక పూర్తి నగరాన్ని నిర్మిస్తున్నాము. కాన్షియస్ సిటీ, రైట్? టెన్నెస్సీ ప్రభుత్వం సంవత్సరానికి అర మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనుకుంటుంది. మా సెంటర్‌ని ప్రచారం చేయడానికి. ఎందుకంటే మేము వారి ఆర్థిక వ్యవస్థకి అంత మేలు చేస్తున్నాం. భారతదేశంలో చేసిన పనిలో 2% కూడా చేయలేదు.
కానీ అలంటి మద్దతు ఉంది. వాళ్ళు మన ఆధ్యాత్మికతలో దేనినీ నమ్మరు. వాళ్ళకి అది పనిచేస్తుందని మాత్రం తెలుసు. ఇంకా వాళ్ళు అది జరగాలనుకుంటారు. ఇక్కడ అది జరగడం ఇష్టం ఉండదు. ఇండియాలో సిటీ కట్టకుండా అక్కడ కట్టడానికి కారణం అదేనా? లేదు, లేదు అలాంటి భూమి లేదు. ఇంకా ఇక్కడ అలాంటి అవసరం లేదు. అంతటా ప్రజలు ఉన్నారు. అదే పాయింట్‌కి వస్తే, ఒక వీడియో వైరల్ అయ్యింది ఓ మహిళ ఆశ్రమం చుట్టూ పరిగెడుతూ ఉంది.
తన భర్తకి కాల్ చేయడానికి ఫోన్ కోసం వెతుకుతోంది. రెండు రోజుల తర్వాత ఆమె ఒక కొలనులో అనుకుంటా శవమై తేలింది. చూడండి, అది కుటుంబ వ్యవహారం నేను దాని గురించి చర్చించాలనుకోను. అది ఆమె కుటుంబ వ్యవహారం. ఓకే, ఓకే, అర్థమైంది, సారీ. మిస్సింగ్ కేసుల విషయానికొస్తే మీరు ఇద్దరు అంటున్నారు కానీ. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. మీరే చెప్పండి ప్రతిరోజూ ఈ దేశంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతమంది ప్రమాదవశాత్తు చనిపోతున్నారు ఇదంతా జరుగుతోంది. లక్షలాది మంది ఒక కేంద్రానికి వచ్చి వెళ్తున్నప్పుడు.
వాళ్ళు వేరే చోటకి వెళ్లి అక్కడ చనిపోతారు. ఆశ్రమంలో కాదు, వేరే చోట. ఆశ్రమం పేరు మీదనా? కానీ హఠాత్తుగా. కొంతమంది, "ఓ వాళ్ళే దానికి బాధ్యులు" అంటారు. ఎందుకు? మీరు ఒక కాలేజీలో చదివారు. క్షమించండి మిమ్మల్ని తీసుకోవద్దులే. ఎవరో ఏదో కాలేజీలో చదివారు. ఒక సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. కాలేజీని నిందిస్తారా? ఎవరో వచ్చి ఒక ప్రోగ్రాం చేసారు, వెళిపోయారు. ఒకటి రెండు వారాల తర్వాత చనిపోయారు.
దానికి ఆశ్రమాన్ని నిందిస్తారా? ఎందుకంటే. ఎందుకంటే, ముందు ఇది అర్థం చేసుకోండి. ఈ దేశంలో ఈ నాగరికతకి చెందిన దేనినైనా నాశనం చేయాలని ఒక పెద్ద దురాలోచన ఉంది. దేనినైనా. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రక్రియను వాళ్ళు చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడే బలం ఉంది ప్రజలు దాని నుండి బలం పొందుతారు. ఈ రోజు బెంగళూరులో వచ్చి చూడండి. మా బెంగళూరు సెంటర్ ఆదియోగి, నాగ టెంపుల్ తప్ప ఇంకేమీ లేదు.
అది ఒక కన్స్ట్రక్షన్ సైట్ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. మా రోజువారీ సందర్శకులు 25 నుండి 30,000 మంది. మేము బెంగళూరు నుండి గంటన్నర దూరంలో ఉన్నాము చిక్కబళ్లాపూర్‌లో. రోజుకి 25 నుండి 30,000 మంది. వారాంతాల్లో 40 నుండి 50,000 మంది. పండుగ రోజుల్లో ఒకటినార నుండి రెండున్నర లక్షల మంది. గత సంవత్సరం మకర సంక్రాంతికి నేషనల్ హైవే మీద 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. బెంగళూరు హైదరాబాద్ హైవే జామ్ అయిపోయింది.
గంటల తరబడి ట్రాఫిక్ వల్ల. ఇప్పుడు. నాకు బెంగళూరు నగరంలో ఇంకొక ప్రదేశం చూపించండి. గుడి అయినా షాపింగ్ మాల్ అయినా. లేదా సినిమా కాంప్లెక్స్ అయినా. రోజుకి 30,000 సందర్శకులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి విజయం వచ్చినప్పుడు. మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కువ పండ్లు ఉన్న చెట్టుకే ఎక్కువ రాళ్ళు తగులుతాయి. అదే విషయం. పండ్లు లేని చెట్టుకి ఎవరు రాయి విసురుతారు?
ఎవరూ విసరరు. అదే విషయం. కొన్ని సార్లు ఫ్యాక్ట్స్ అనుకున్న కూడా. ఆర్టికల్స్ చదువుతుంటే కొంచెం ఫిషీ అనిపిస్తది అంటే, ఆ అలిగేషన్లు. లేదు లేదు, నేను చెప్తున్నాను వాళ్ళకి తెలుసు. అందరూ దాన్ని నమ్మరని. కానీ 2 నుండి 5% ప్రజలు ఉంటారు. 2% నమ్ముతారు. ఇంకొక 5-6% ప్రజలు. ఓ, అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు అనుకుంటారు. వాళ్ళు సృష్టించాలనుకున్నది అదే వాళ్లకు కావాల్సింది ఆ జనాభానే. ఎందుకైనా మంచిదిలే టెన్షన్ ఎందుకులే అన్నట్టు. ఒక మనిషి చేయగలిగిన చేయలేని ప్రతీదానికీ నన్ను నిందించారు.
ఏమైనా ఆధారం ఉందా? వాళ్ళ దగ్గర ఏమైనా వాస్తవాలు ఉన్నాయా చెప్పడానికి? ఉట్టి ఊహాగానాలు. మీరు 10 మందిని రేప్ చేసి చంపేశారని అనుకుంటున్నాను. నేనలా అనుకుంటున్నాను. ఏంటీ చెత్త? ఏదైనా ఆధారం చూపించాలి కదా? కనీసం ఏదో ఒకటి బహుశా అన్నీ విచారించలేను. కనీసం ఏదో ఒకటి. ఎవరైనా ముందుకు వచ్చి నాకు ఇలా జరిగిందనన్నా చెప్పాలిగా.
లేదు. వేరే ఎవరో ఎక్కడి నుంచో చెప్తారు ఇదంతా జరుగుతోంది అంటారు. ఇది. బహుశా ఎందుకంటే. లక్షలాది మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇంకా ఇంత పెద్ద సంస్థ నడుస్తున్నప్పుడు. ఏదైనా ఒక చిన్న తప్పు అవ్వకుండా ఉంటదా? అనే ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా? చూడండి మేము ఎలా జీవిస్తామో మీకు తెలీదు. అడగండి నేను నా దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ నిరంతరం ప్రాణాలు తీస్తుంటాను. వాళ్ళ జీవితాలను ఎంతో నిక్కచ్చిగా చేస్తూ ఉంటాను. కచ్చితంగా ఉండడానికి తప్పు అడుగు పడకుండా ఉండడానికి.
అది ఈజీ కాదు అది ఓ సైన్యాన్ని నడపడం లాంటిది అర్థమవుతుందా? అలా నడుస్తుంది అలాంటి క్రమశిక్షణ,ఫోకస్ ఇంకా దృఢత్వంతో నడుస్తుంది. కేవలం దీని కోసమే ఎందుకంటే ఏదైతే మీరు ఆధ్యాత్మిక ప్రక్రియగా భావిస్తున్నారో. అది దురదృష్టవశాత్తూ మురికిలో పడిపోయింది. నేను దానిని మళ్ళీ అది ఒకప్పుడు ఉన్న పీఠం మీద పెట్టాలనుకుంటున్నాను. గతంలో ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తి వస్తే. చక్రవర్తి కూడా ఆయన పాదాల మీద పడేవాడు. ఈ రోజు. వాళ్ళు దాన్ని మురికిలో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. సరే కొంతమంది తప్పులు చేసి ఉండవచ్చు నేను కాదనట్లేదు.
కానీ అవినీతిపరులు ప్రతీ వృత్తిలో ఉంటారు. అవునా కాదా? అవినీతిపరులైన పాడ్కాస్టర్లు లేరా? లేరా? ఉండొచ్చు. ఉన్నారు, కమాన్. కానీ బాధ్యత మీదే కదా? అంటే మీ కింద ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తే. ఎందుకంటే వాళ్ళూ మనుషులే కదా. లేదు, లేదు, లేదు. నేను చెప్పేది. అవినీతిపరులైన డాక్టర్లు ఉన్నారా? ఉండొచ్చు అవును. అవినీతిపరులైన లాయర్లు ఉన్నారా? ఉండొచ్చు ఏంటి. ఉన్నారు, ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు అవునా కాదా? కేసులు ఉన్నాయి వాళ్ళని విచారించారు.
చాలామంది జైల్లో ఉన్నారు. అవినీతిపరులైన లాయర్లు ఉన్నారా? అవినీతిపరులైన జర్నలిస్టులు ఉన్నారా? అవినీతిపరులైన పోలీసులు ఉన్నారా? అవినీతిపరులైన రాజకీయ నాయకులు ఉన్నారా? కాబట్టి కొంతమంది అవినీతిపరులైన ఆధ్యాత్మిక నాయకులు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ వాళ్ళు అక్కడ ఉండకూడదు. కానీ ఉన్నారు ఏం చేయగలం? ఒక డాక్టర్ ఏదో తప్పు చేసినందున మీరు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళరా? అలాంటిదేమీ లేదు. అది లేకుండా బతకలేం. ఇది కూడా అదే.
ఎవరికైనా ఏదైనా చేదు అనుభవం కలిగి ఉంటే. వాళ్ళని దుర్వినియోగం చేయడమో లేదా వాళ్ళకి ఏదో జరగడమో చోటు చేసుకుని ఉంటే. వాళ్ళని మాట్లాడనివ్వండి ఒక్కరిని మాట్లాడమనండి. ఒక్కరు. ఇన్ని సంవత్సరాల్లో కేవలం ఒక్కరిని చూపించండి చూస్తాను. అప్పుడు మీరు ఏమైనా తప్పు జరిగితే మీరు వాళ్ళని చంపేస్తారు అంటారు. మీకు వెర్రి. మీరలా చేయగలిగినంత శక్తివంతులు అని ప్రజలు అనుకుంటున్నారు. మీకు వెర్రని అర్ధం నేను చెప్తున్నాను. మీకు పిచ్చి. మీకు జీవితం గురించి ఏ మాత్రం అవగాహన లేదు జీవితం ఎలా పనిచేస్తుందో మీకు తెలీదు.
సమాజం ఎలా పనిచేస్తుందో మీకు తెలీదు చట్టం ఎలా పనిచేస్తుందో మీకు తెలీదు. మీకు ఏమీ తెలీదు. నేను ఏదైనా చేసేప్పుడు దానికి సంబంధించిన అన్ని అంశాలూ నాకు తెలిసేలా చూసుకుంటాను. నేను రెండు అంగుళాల భూమిని తీసుకొని. నేను చేసే మిగతా అన్నింటినీ నాశనం చేసుకునేంత పిచ్చివాడ్ని కాను. ఈ పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత. అంటే దాని వల్ల ఈశాకి గానీ మీకు వ్యక్తిగతంగా గానీ. ఏమైనా ప్రయోజనం ఉందా? నిజంగా లేదు. దేశం నన్ను గౌరవించాలనుకుంది కాబట్టి నేను తీసుకున్నాను.
కేవలం పద్మవిభూషణ్ విషయంలో మాత్రమే కాదు. తెలుసా. అవార్డుల గురించి నేను ఎప్పుడూ కొంచెం అసౌకర్యంగా భావిస్తాను. చాలా అవార్డులను నేను తప్పించుకుంటాను. నేను వద్దు అంటాను. పిలుపులు వచ్చినప్పుడు మీకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము అని అన్నప్పుడు. నేను వద్దు అంటాను. ఎందుకంటే నా స్కూల్ సమయం నుండి ఇలా ఉన్నాను. నేను ఎన్నో స్పోర్ట్స్ మెడల్స్, కప్స్ గెలిచాను. కానీ ఎప్పుడూ వెళ్ళి వాటిని తీసుకోలేదు. ఎప్పుడూ ఏదో ఒక స్నేహితుడిని పంపి నువ్వు తీసుకో, నువ్వు ఉంచుకో అనేవాడిని. ఎందుకంటే నేను.
నేను అలా ఉంటాను అది నాకు పట్టదు. అయితే ముగ్గురు రాష్ట్రపతుల నుండి. మూడు రాష్ట్రపతి అవార్డులను అందుకున్న ఏకైక జీవించి ఉన్న భారతీయుడిని నేనే. ఇది ఎందుకు చెప్తున్నానంటే. తర్వాతి ప్రశ్న బిజెపి మీకు ఈ అవార్డులన్నీ ఇస్తోంది అంటారు. బిజెపి ప్రభుత్వంలో కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు అందుకున్నాను. ఒకటి బిజెపి సమయంలో. సరేనా? ఎవరో ఒకరు అధికారంలో ఉండాలి. అవును.
అది అనివార్యం. ఈశా ఫౌండేషన్‌లో కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి విగ్రహం గురించి మాట్లాడతారా? చాలామందికి అది శివుడు అనుకుంటారు కొంతమంది. మాకు తెలిసినవాళ్ళే కార్లల్లో పెట్టుకుంటారు కొంతమంది. అది ఫ్యాక్టరీ బిల్డింగ్ అని చెప్తారండి వాళ్ళు. మీకు ఆ కథ చెప్తాను. ఎవరో ఓ కంప్లైంట్ ఇచ్చారు. మేము అనుమతి లేకుండా ఫ్యాక్టరీ షెడ్ నిర్మించాం అని. కాబట్టి విచారణ. వాళ్ళు వచ్చారు.
కలెక్టర్ తన అధికారులతో కలిసి వచ్చారు. కలెక్టర్ చుట్టూ చూసి ఫ్యాక్టరీ షెడ్ ఎక్కడ? అని అడిగాడు. ఈ అధికారి ఆదియోగిని చూయించాడు. కలెక్టర్ ఇది ఫ్యాక్టరీ షెడ్ ఆ? ఇది ఒక స్మారక చిహ్నం, దానికి వాళ్ళు అనుమతి తీసుకున్నారు అన్నాడు. అతను లేదు నా ఉద్దేశంలో ఇది ఫ్యాక్టరీ షెడ్. లోపల మెటల్ భాగాలు ఉన్నాయ్ బయట మెటల్ షీట్స్ ఉన్నాయ్.
కాబట్టి ఇది ఫ్యాక్టరీ షెడ్ అన్నాడు. ఈ వ్యక్తి ఎవరో చెప్పండి. అంచనా వెయ్యండి ఎవరో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే. అన్ని రంగాలలోనూ ఈ అపారమైన విజయం వల్ల. మేం ఏది చేసినా సరే. ప్రస్తుతం మేం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమం, అర్థమవుతుందా? మా 'కావేరీ కాలింగ్' మొత్తం ఉష్ణమండల ప్రపంచానికి ఒక నమూనా. ఇది UN ఏజెన్సీలు చెప్తున్న మాట నేను కాదు. ఇది కేవలం ఒక శాంపిల్ అన్నది నా ఉద్దేశం.
నేను వాళ్లతో చెప్పినప్పుడు. UNCCD డైరెక్టర్ జనరల్‌తో చెప్పినప్పుడు. మేం ఒక శాంపిల్ ప్రాజెక్ట్ చేశాం ఇది సాకారం చేయడానికి అన్నప్పుడు. ఆయన దాని సైజ్ చూసి. సద్గురు ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ మీరేంటి దీన్ని శాంపిల్ అంటున్నారు అన్నారు. నేను ఇది ఇంకా ఏ సమస్యనూ పరిష్కరించలేదు. ఇది పెరగాలి. ఇది నిజమైన పరిష్కారం కావాలంటే ఇంకో 100 రెట్లు పెరగాలి అన్నాను. కాబట్టి నేను ఇది శాంపిల్ అనుకుంటున్నాను. కానీ ఆయన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. మేం ఏ పని చేసినా దాన్ని బాగా చేయడం వల్ల, అదొక సమస్య.
కాబట్టి విజయాన్ని ఇష్టపడని కొందరు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరూ వాళ్ళు చేస్తున్న ఏ పనిలోనైనా విజయవంతం కావాలని కోరుకుంటాను. ప్రజలు సద్గురు మా అబ్బాయిని ఆశీర్వదించండి అనడుగుతారు. తల్లిదండ్రులు షాక్ అవుతారు. నేను నీకు నచ్చినది చేయి కానీ దాన్ని బాగా చెయ్యి అంతే అంటాను. బాగా చేయకపోతే అది జీవితాన్ని వృధా చేయడమే కాదా? మీరు చదువుకోవాలనుకున్నా. వ్యాపారం పెట్టాలనుకున్నా, డ్యాన్స్ చేయాలనుకున్నా. లేదా కేవలం ఒక జోకర్‌గా ఉండాలనుకున్నా సరే. దాన్ని బాగా చేయండి.
ప్రతి దానిలోనూ ఏదో ఒకటి ఉంటుంది కదా? దాన్ని బాగా చేస్తే. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు దాన్ని బాగా చేయాలి. వాళ్ళకి నచ్చనిది అదే. అక్కడి అనుభవం గురించి మాట్లాడితే శివరాత్రి గురించి మాట్లాడితే. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళని గానీ లేకపోతే ఆ వీడియోస్ చూస్తుంటే గానీ. ఎప్పుడెప్పుడు వెళ్ళి అనుభూతి చెందుదామా అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఆ అనుభవం గురించి మాట్లాడదామా? రావొచ్చు కదా? ఈ సంవత్సరం రావడానికి ప్లాన్ చేస్తున్నాను, హోప్ఫుల్లీ. ప్లానింగ్ ఆ? మీరు రావట్లేదు, పర్లేదు. లేదు లేదు.
తప్పకుండా, నేను ఈసారి వచ్చేలా చూసుకుంటాను. ఇదేమైనా మంగళయాన్ అనుకుంటున్నారా? లేదు లేదు. కోయంబత్తూర్ సిటీ. అఫ్ కోర్స్, అంటే ఈసారి వచ్చేలా చూసుకుంటాను. అక్కడి అనుభవం గురించి మాట్లాడదామా చూస్తున్న వీక్షకుల కోసం. అక్కడికి రాలేకపోయిన వాళ్ళు కనీసం ఇప్పుడు ప్లాన్ చేసుకోగలరని. చూడండి. ఈ గ్రహం మీద అలాంటి కార్యక్రమం ఇదొక్కటే. మరొక్కసారి పరిమాణం ఇంకా ప్రాముఖ్యత పరంగా కూడా. పరిమాణం పరంగా గత సంవత్సరం.
ఆ రోజు లైవ్‌లో మా వీడియో వీక్షణలు ఎంతంటే 14.2 కోట్ల మంది ప్రజలు. సరేనా? ఇది గ్రామీ అవార్డుల కన్నా ఎక్కువ అమెరికాలోని సూపర్ బౌల్ కన్నా ఎక్కువ. అమెరికాలో సూపర్ బౌల్‌ని అతిపెద్ద విషయంగా భావిస్తారు. అక్కడ 30 సెకన్ల యాడ్‌కి కొన్ని మిలియన్లు ఖర్చవుతుంది ఓకే? ఇది దానికంటే పెద్దది ఇంకా ఇదంతా ఉచితం. ప్రజలు ప్రేమ, భక్తితో సహకరిస్తారు, దానితో ఇది నడుస్తుంది. కానీ మీరు చెప్పినట్లు. మహాశివరాత్రికి రెండు నెలల ముందు.
మేం సుప్రీం కోర్టులో హైకోర్టులో ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో. ముందస్తు జాగ్రత్త విన్నపాలు తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఎలాగైనా ఆపాలని ఎదురుచూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఒక పనికిరాని నాన్సెన్స్పై ఒక కోర్టు ఆర్డర్ దొరికితే. వాళ్ళు ఆపగలరు. వాళ్ళు ఎందుకు ఆపాలనుకుంటున్నారు చెప్పండి? నాకు కూడా అదే ప్రశ్న వచ్చింది. అదే విషయం. మీరు ఈ దేశంలో జీవించట్లేదు. మీరు కళ్ళు, చెవులు తెరిచి చుట్టూ గమనిస్తే. నాగరికత ప్రాముఖ్యత ఉన్న దేన్నైనా ఆపాలనే అజెండా. ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ.
అది జరుగుతూనే ఉంది. ఒక స్పష్టమైన అజెండా బాగా నిధులు సమకూర్చబడిన అజెండా. నడుస్తోంది. కాబట్టి మేం ఆ అజెండాకి ఎప్పుడూ బాధితులుగానే ఉంటున్నాం. కాబట్టి ఆ రకంగా ఇది అతిపెద్ద ఈవెంట్. మేం అక్కడికి వచ్చే ప్రజలను సుమారుగా. 8 వందల వేలు అంటే సుమారు 8 లక్షల మందికి పరిమితం చేస్తాం. 8 లక్షలు. ఎందుకంటే దానికి మించి వెళ్తే తొక్కిసలాటలు లాంటివి జరగవచ్చు. కాబట్టి మేం సరైన బ్యారియర్లు ఏర్పాటు చేసి పూర్తిగా మేనేజ్ చేస్తాం. వేలాది మంది వాలంటీర్లకు కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తాం.
ఇది పోలీసులచే నడపబడదు. ఏదైనా పెద్ద VIP వస్తే పోలీసులు వస్తారు. అవును. అది తప్ప ఇది పూర్తిగా మా చేతే నడపబడుతుంది. శిక్షణ పొందిన వాలంటీర్లచే నడపబడుతుంది. ఒక్క సంఘటన కూడా జరగకుండా ఇంత పెద్ద ఈవెంట్. అంత సులభం కాదు. వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారో తెలుసా మీకు? వాళ్ళు వచ్చి ఫారెస్ట్ గార్డ్‌కి కొన్ని వేల రూపాయలు ఇస్తామని చెప్పి. ఒక ఏనుగును తరిమి మహాశివరాత్రి ఈవెంట్లోకి పంపించు అంటున్నారు. ఓ మై గాడ్. మేం వాళ్ళను పట్టుకున్నాం.
ఎందుకంటే ఆ ఫారెస్ట్ గార్డ్ అలా చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఒకవేళ అతను డబ్బు తీసుకుని ఏనుగును తరిమి ఉంటే. కొన్ని డజన్ల మంది చనిపోయినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మమ్మల్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్నారు అంతే. అదెంత క్రూరత్వం? అదెంత క్రూరత్వం? అరే గత కొన్ని వందల ఏళ్లలో ఈ దేశంలో ఎలాంటి క్రూరమైన పనులు జరిగాయో తెలుసా? ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇలా ఉంటుంది. ఇది అతిపెద్ద ఈవెంట్ ఇవన్నీ మేం చూసుకోవాలి. మా వాలంటీర్లు గార్డులతో ఫారెస్ట్ గార్డులతో పాటు అక్కడ ఉండి.
ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటారు. స్వతహాగా అవి మా ప్రాపర్టీలోకి రావు. ఎవరైనా వాటిని తరిమితే తప్ప. ఒకవేళ టపాకాయలతో వాటిని తరిమితే రావచ్చు. లేదంటే అవి ఎప్పుడూ ఈ వైపు రావు. వాటికి వాటి సొంత భూభాగం ఉంది అటు వైపు వెళ్తాయి. మేం వాటి దారిలో ఎక్కడా లేము. మేం ఏ ఏనుగుల కదలిక మార్గంలో లేము. ఎందుకంటే ఇవి వ్యవసాయ భూములు. ఇంకా ప్రజలు వ్యవసాయం చేస్తూ వచ్చారు. వాళ్ళ దగ్గర 1936 నుండి పట్టా ఉంది.
మేం కొన్న భూములన్నింటికీ ప్రజల దగ్గర సరైన పట్టా ఉంది. 1936 నుండి. అకస్మాత్తుగా అది అడవి ఎలా అయింది? ప్రజలు అక్కడ వ్యవసాయం చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళు అడవిలో వ్యవసాయం చేస్తున్నారా? కేవలం హాస్యాస్పదమైన నాన్సెన్స్ ఏదేమైనా. కాబట్టి ఇది అతిపెద్ద ఈవెంట్. 12 గంటలు, సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకు. ఇది ఒక్కటే ఇలాంటి కార్యక్రమం. ఆల్కహాల్, డ్రగ్స్ లేకుండా పూర్తి 12 గంటలు ప్రజలు పూర్తి ఉత్సాహంతో పాల్గొంటారు.
సంగీతం, నృత్యం, ధ్యానం, ప్రసంగాలు, అన్నీ జరుగుతాయి. ఫుల్ ఆన్, చిన్న పిల్లలు కూడా పూర్తి రాత్రి ఉదయం 6 వరకు మేల్కొని ఉంటారు. ఎందుకంటే అక్కడ సృష్టించబడిన శక్తి ఉత్సాహం అలాంటిది. ఇది ఏదో మాయతో రావడం లేదు ఇది ప్రజల భక్తి. అక్కడ జరుగుతున్న దానిపై ప్రజల ప్రేమ. నేను దీన్ని మొదటిసారి 1984లో ప్రారంభించినప్పుడు. 70 మంది ఉండేవారు. మహాశివరాత్రిలో పాల్గొనేవారు ఓకే?
70 మంది. ఈ రోజు గత సంవత్సరం 14.2 కోట్ల మంది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటుంది. వర్చువల్లీ. ఎందుకంటే 2025లో మా వీడియోలు 6 బిలియన్ల వీక్షణలను దాటాయి. ఇది కేవలం మా ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే. కనీసం వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. అవి మా కంటెంట్‌ను వాటంతటవే ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే మేం మా ఆర్కైవ్స్‌ను ఓపెన్‌గా ఉంచాం ఎవరికైనా కంటెంట్ కావాలంటే మేం ఇస్తాం. ఎందుకంటే ముఖ్యమైన విషయం మనం ప్రజలను చేరడం.
ఇది నా గురించి కాదు ఈశా ఫౌండేషన్ గురించి కాదు. మానవ చరిత్రలో ఇది మొదటిసారి. మీరు దాదాపుగా గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడగలరు. ఎందరో మహానుభావులు వచ్చారు. వాళ్ళు మాట్లాడినప్పుడు, పట్టుమని 10 మంది కూడా వినలేకపోయారు. కృష్ణుడు వచ్చాడు, ఆయన ఒక వ్యక్తితో మాట్లాడగలిగాడు. ఇంకా ఆ మనిషికి ఎన్నో సందేహాలు. అవునా కాదా? జీసస్ వచ్చాడు, ఆయన 12 మందితో మాట్లాడాడు.
ఒకతను ఆయనపై తిరగబడ్డాడు. బుద్ధుడు వచ్చాడు, ఆయన కొన్ని వందల లేదా వెయ్యి మందితో మాట్లాడాడు. ఇక్కడ కూర్చుని ప్రపంచం మొత్తంతో మాట్లాడగలగడం. ఇదే మొదటిసారి. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం మానవ జీవితాన్ని మార్చకపోతే. దానర్థం మన హృదయాలలో ప్రేమ లేదనే. నేను అలాంటి వ్యక్తిని కాదు అంతే. మీరు ఖచ్చితంగా ఒక మార్కెటింగ్ జీనియస్. అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. మీరు దీన్ని మార్కెటింగ్ అంటారా? అఫ్ కోర్స్, టెక్నాలజీని ఉపయోగించుకుని అంటే కంటెంట్‌ను ఉత్తమమైన మార్గాల్లో పంపిణీ చేయడం.
చూడండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు ప్రజలను మార్కెట్ అని పిలిచిన క్షణం. అది నాకు అసభ్యకరంగా అనిపిస్తుంది. లేదు, నేను అనుకునేది. నేను దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మార్చడానికి ప్రయత్నించాను. వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని పిలుస్తున్నారు. మేము మార్కెట్ కాదు, మేం ప్రజలం అన్నాను. మమ్మల్ని ప్రజలుగా చూడండి మేం మీ వ్యాపారానికి మద్దతు ఇస్తాం. ప్రపంచంలో ఏ ఉత్పత్తి విజయవంతమవుతుంది చెప్పండి?
ప్రతి ఒక్కరికీ అవసరమైన ఉత్పత్తియా? లేదా మీరు బలంగా అమ్మే ఉత్పత్తియా? మనం బలంగా అమ్మే ఉత్పత్తి. నిజంగానా? మీరు ఎక్కడి నుండి వచ్చారు? లేదు దాన్ని అలాగే మార్కెట్ చేస్తారు కదా? లేదు. ప్రజలకు అవసరమైన ఉత్పత్తి సహజంగానే విజయవంతమవుతుంది కదా? ఒకవేళ నాకు దాని గురించి తెలియాలంటే నేను. లేదు లేదు గూగుల్ విజయవంతమైంది అనుకుందాం ఎందుకు? ఎందుకంటే అది ప్రతి ఒక్కరికీ అవసరం. అది రీచ్ వల్ల. ఆ? అది రీచ్ వల్ల కదా? లేదు లేదు నేను మాట్లాడుతున్నది అది కాదు. చూడండి, నేను గూగుల్‌ని ఉదాహరణగా తీసుకుంటున్నాను చాలా పెద్ద వాటిలో అది ఒకటి.
అది ఎందుకు విజయవంతమైంది? ఎందుకంటే అందరికీ దాని అవసరం ఉంది. ఈశా ఫౌండేషన్ ఎందుకు విజయవంతమైందని అనుకుంటున్నారు? ఎందుకంటే అది ప్రతి ఒక్కరికీ అవసరం. కానీ. వాళ్ళకు అవసరమైనది అందుబాటులో ఉందని వాళ్ళకి తెలియజేయడం నా పనా? అలాగే అందులో ఏమైనా తప్పుందా? లేదు లేదు లేదు అస్సలు లేదు. ఇది ఎలా అంటే. హైదరాబాద్ నగరం మొత్తం దాహంతో ఉంది వాళ్ళకు నీళ్ళు లేవు అనుకుందాం. కానీ మీ ఇంట్లో పెరట్లో ఒక మంచి తియ్యటి నీళ్ళ బావి ఉందనుకుందాం.
మీరు కేవలం కళ్ళు మూసుకుని కూర్చున్నారానుకోండి. వాళ్ళకు కనబడితే తాగుతారు లేకపోతే అది నా పని కాదు అంటే. నేను మీరో నేరస్థుడని అనుకుంటాను. అవునా కాదా? అవును. మీ ఇంటి పైకప్పు మీద నిలబడి. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి దయచేసి తాగండి అని అరవడం మీ పని. నేను చేసేది అదే. దాన్ని మీరు. నాకు అర్థమైంది కానీ మార్కెటింగ్ అనేది నెగటివ్ పదం కాదు కదా. లేదు లేదు లేదు. నేను మీ మాటలకు రియాక్ట్ అవ్వడం లేదు.
నేను మీకు చెప్తున్నాను. మీ శ్రోతలకు కూడా. దయచేసి అర్థం చేసుకోండి ఇదేంటో. ఇది సరిగ్గా ఇలాంటిదే. మీ దగ్గర ప్రతి ఒక్కరికీ అవసరమైనది ఉంది కానీ వాళ్ళకి తెలీదు. వాళ్ళకి చెప్పాలా వద్దా? ఏదేమైనా నేను మీకు ఇది చెప్తాను. ఇన్నేళ్లలో. మేం ఎప్పుడూ PR ఏజెన్సీలను గానీ. మార్కెటింగ్ కంపెనీలను గానీ నియమించుకోలేదు. ఇదంతా వాలంటీర్ల ప్రేమే. ఎందుకంటే అది వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసింది.
వాళ్ళు అది జరగాలని కోరుకుంటున్నారు. వృత్తిపరమైన మార్కెటింగ్ కాదు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్లి. కొన్ని ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏజెన్సీలను సంప్రదించారు. వాళ్ళు, మీరు చేసే విధంగా మేం చేయలేం అన్నారు. ఎందుకంటే మేం 7 రోజులు, రోజుకు 20 గంటలు 365 రోజులు పనిచేస్తాం. ఎందుకంటే మేం దాన్ని ఏదో పొందడానికి ఒక వ్యాపారంగా చేయట్లేదు. ఇది జీవిత అర్పణ ఇది మా శ్వాస. మేం ఇలా శ్వాసిస్తాం.
కాబట్టి శ్వాసించడం ఆపలేరు. అది ఇదే. మేం ఏది చేసినా అది ఒకేలా ఉంటుంది. ఇది ఒక అర్పణ, ఎలాగోలా ప్రజలు దాన్ని ఏదో ఒక విధంగా అనుభూతి చెందేలా చూడటానికి. అంటే ఉనికి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే. నేను ఒకసారి మీరు ఒక పాట పాడుతుంటే విన్నాను. నిజానికి తెలుగు పాట నేను షాక్ అయ్యాను మీరు పాడుతున్నప్పుడు. దాని అర్థం కూడా అదే. వస్తాం ఉట్టిగనే వస్తాం పోతాం ఉట్టిగనే పోతాం. అమృతం లాంటిది లేకపోతే అన్నదమ్ములు కూడా ఉండరు అంటూ మీరు ఒక పాట పాడారు.
ఆ తర్వాత నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను. నేను మిమ్మల్ని అదే అడిగితే. నేను పుట్టక ముందు ఏమై ఉన్నానో నాకు తెలీదు చనిపోయిన తర్వాత ఏమవుతుందో కూడా తెలీదు. నేను ఎందుకు ఉన్నాను? ఈ ప్రశ్న గనక అడిగితే. నా దృష్టిలో అందరూ ఈ ప్రశ్న వేసుకోవాలి. నన్ను నేను కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు బహుశా కొంతమందికి ఇది కొంచెం వింతగా ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళ కోసం. నేను మిమ్మల్ని అది అడిగితే. ఉనికి అనే కాన్సెప్ట్ ఏంటి? ఒక వ్యక్తి దీని గురించి ఏం అర్ధం చేసుకోవాలని మీరంటారు? ఉనికి ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నారా?
మీ కాన్సెప్టా? ప్రశ్న. అది చాలా పెద్ద అహంకారం. అయ్యో. ఉద్దేశం అది కాదు. లేదు లేదు నాకు తెలుసు. ఇదే సమస్య చెప్పాను కదా. మీరు భారతీయులు కావచ్చు, కానీ మీ మనసు ప్రాథమికంగా యూరోపియన్ది. ఎందుకంటే విద్య అక్కడిదే. ఎందుకంటే అదంతా కాన్సెప్టులు, సిద్ధాంతాలు, ఆలోచనలు, వస్తువుల గురించే. ఇది దాని గురించి కాదు, మీరు లేకపోయినా ఉనికి ఉంది, అవునా కాదా?
మీరు ఉండటం వల్ల అది ఇక్కడ ఉందనుకుంటున్నారా? ఎవరో ఒక యూరోపియన్ డేకార్ట్ ఇలా అన్నాడు. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అన్నాడు. దాన్ని గొప్ప మేధోసంపత్తిగా భావిస్తారు. మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఆలోచించడం వల్ల మీరు ఉన్నారా లేక మీరు ఉండటం వల్ల ఆలోచించగలరా? నేను ఉన్నాను కాబట్టి ఆలోచిస్తున్నాను. అవును. కానీ. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అనేది వేరే చోట చాలా అద్భుతమైన తత్వం. భారతదేశంలో దాన్నసలు లెక్కలోకి తీసుకోం.
మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం మానవ ఆలోచనకి ఏ ప్రాముఖ్యత ఇవ్వం. ఎందుకంటే అది కేవలం అదే డేటాని. చాలా పర్ముటేషన్స్, కాంబినేషన్లలో కలిపి వల్లెవేస్తూ ఉంటుంది. కొత్తగా ఏమీ అన్వేషించబడదు. కాబట్టి మనం ఎప్పుడూ మన సొంత మానసిక నిర్మాణం కంటే. మన సొంత మానసిక ప్రక్రియ కంటే లోతుగా ఎలా వెళ్ళాలి అని చూశాం. కాబట్టి మనం దానికి ఏ ప్రాముఖ్యతా ఇవ్వం. కాబట్టి కాన్సెప్టులు లేవు, తత్వాలు లేవు, సిద్ధాంతాలు లేవు. కానీ మీరు మీ గ్రహణశక్తిని పదును పెట్టుకొని. ఇప్పుడు తెలుసుకున్న దానికి మించి ఇంకా ఏదో తెలుసుకోవచ్చు.
అందుకే మేము దాన్ని 'టెక్నాలజీస్ ఫర్ వెల్ బీయింగ్' అంటున్నాం. ఇప్పుడు చూడండి. మీరూ నేనూ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ పరికరం వల్ల. ఈ టెక్నాలజీ వల్ల. లక్షలాది మంది వినగలరు. చాలా నిజం. నేను ఇక్కడి నుండి అరిస్తే లక్షలాది మంది వింటారా? లేదు. ఓ టెక్నాలజీని ఉపయోగిస్తాం. టెక్నాలజీ అంటే ఏంటి? కేవలం మన గ్రహణశక్తిని పెంచడమే అవునా? ఎవరో ఎక్కడో మాట్లాడుతున్నారు నా ఫోన్‌ని ఇక్కడ పట్టుకుంటే.
వాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో ఎక్కడో ఉన్నారు, వాళ్ళని ఇక్కడ వినగలను. గ్రహణశక్తిని పెంచడమా కాదా? ఇది మీరు భౌతిక టెక్నాలజీ లేకుండా కూడా చేయవచ్చు. బాగా చూస్తారు బాగా వింటారు. ప్రతీదాన్ని ప్రస్తుతం చూస్తున్న దానికంటే చాలా లోతుగా చూస్తే. అప్పుడు మీరు ఇంకేదో తెలుసుకుంటారు. అలా జరగనప్పుడు దాన్ని ఊహించుకుంటున్నారంతే. మీరు ఊహించుకున్న దానికి ఏ ప్రాముఖ్యతా లేదు. అది రోజువారీ జీవితానికి మంచిది. మీ వ్యాపారాన్ని కొంచెం మెరుగ్గా చేయవచ్చు. కానీ ప్రాముఖ్యమైనదేమీ తెలుసుకోరు.
జీవితం మరింత ప్రాముఖ్యమైనదిగా మారదు. వేరొకరి కంటే కొంచెం ఎక్కువ విజయవంతం కావచ్చు. మీ మొత్తం విషయం ఇతరుల వైఫల్యాలను ఆస్వాదించడమే అయితే. ఫర్వాలేదు. లేదంటే దానికి విలువే లేదు. అండ్ ఈ పాడ్కాస్ట్ని ముగించడానికి ముందు. ఒక పాయింట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు మానసిక ఆరోగ్యం లేదా మానసిక శ్రేయస్సు గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను దాని గురించి మాట్లాడుతూ ఉండను. మీరు చాలాసార్లు దాని గురించి ప్రస్తావించారు. లేదు లేదు. డబ్ల్యూహెచ్ఓ మానసిక ఆరోగ్య మహమ్మారి రాబోతోందని చెప్తోంది.
అలాగే మీరు సైకాలజిస్టుల మీద లేదా. సైకియాట్రిస్టుల మీద వేరే అభిప్రాయం కలిగి ఉన్నారు. నాకు ఆ వైరుధ్యం అర్థం కాలేదు. చూడండి. అనారోగ్యం సహజం అనుకుంటే మీరు ఈ గ్రహం మీద ఒక నేరం చేస్తున్నారనే. అది శారీరకమైనా మానసికమైనా. ఆరోగ్యం సహజం. అనారోగ్యం సంభవిస్తుంది. అప్పుడప్పప్పుడు సంభవిస్తుంది, అది సంభవించినప్పుడు మనకి డాక్టర్ కావాలి. అయితే శారీరక అనారోగ్యం గురించి మాట్లాడితే.
దాదాపు 70% శారీరక అనారోగ్యం దీర్ఘకాలికమైనవి. అంటే మీరే ఈ అనారోగ్యాన్ని తయారు చేసుకుంటారు. సుమారు 30% ఇన్ఫెక్షన్లు అదీ ఇదీ జరుగుతాయి. వాటన్నింటికీ మనం వివిధ మందులు, వ్యాక్సిన్లు అదీ ఇదీ అన్నీ సృష్టించాం. బయట నుండి వచ్చేది వేరే జీవి చేసే దాడి. అది జరిగితే దయచేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దాన్ని సరిచేయించుకోండి. కానీ మీ లోపల నుండి మీరే ఒక వ్యాధిని సృష్టిస్తుంటే.
కూర్చొని నేను ఇది ఎందుకు చేస్తున్నాను అని చూడొద్దా? ఎందుకంటే ఎవరూ అనారోగ్యం కోరుకోరు. కానీ దాన్ని తయారు చేసుకుంటున్నారు. అదే మానసిక ఆరోగ్యానికీ వర్తిస్తుంది. అది చాలా వరకు మీ లోపలే తయారు చేయబడుతుంది. సరే జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. కొందరిలో వ్యాధిసంబంధమైన పరిస్థితులు ఉండొచ్చు. అయినప్పటికీ ఆ సంఖ్య చాలా తక్కువ. వాళ్ళకి వేరే విధంగా చికిత్స చేయాలి. మిగతా చాలామంది వాళ్ళు ఉన్న సామాజిక పరిస్థితులకి. వారి ప్రతిచర్యల కారణంగా మానసిక రుగ్మతలకు పాలవుతున్నారు.
వాళ్ళు తమ మానసిక ప్రక్రియ యొక్క పునాదులను. జీవిత ప్రక్రియ వల్ల ప్రభావితం కాకుండా ఉండేలా బలపరచుకోవట్లేదు. ప్రతీ చిన్న విషయం వాళ్ళని కలవరపెడుతుంది. మిమ్మల్ని మీరు ఇలా ఎందుకు తయారు చేసుకున్నారు? మనం ఇలాంటి జనాభాను ఎందుకు సృష్టిస్తున్నాం? ఎందుకంటే మనం డాక్టర్ మనల్ని సరిచేయాలని అనుకుంటాం. ఆ సందర్భంలో నేను ఇలా అన్నాను. మీరు.
ఇది ఇలా ఉంటుంది. నేను ఓ జోక్ చెప్పొచ్చా? ప్లీజ్. ఇది చెన్నై మెరీనా బీచ్‌లో జరిగింది. ఒక వ్యక్తి నడుస్తున్నాడు. ఒక యువకుడు వచ్చి సార్ టూత్ బ్రష్ సార్. మార్నింగ్ వాక్. టూత్ బ్రష్ సార్, టూత్ బ్రష్, టూత్ బ్రష్ సార్ ఒక వెయ్యి రూపాయలు. ఏయ్ పో అన్నాడు. కానీ వదల్లేదు. అప్పుడాయన మోసాగాడా, ఒక టూత్ బ్రష్ ఒక వెయ్యి రూపాయలా? ఏంటీ వెర్రి అన్నాడు. వాడు సరే సార్ అని తన బ్యాగ్‌లో చేయి పెట్టి ఒక చిన్న ప్లాస్టిక్ బ్యాగ్.
చిన్న ప్యాకెట్ తీసి. సార్ ఇంట్లో చేసిన బిస్కెట్లు సార్. కేవలం రెండు రూపాయలే అన్నాడు. సరే అన్నాడు వాడిని వదిలించుకోవడానికి. రెండు రూపాయలిచ్చి తీసుకున్నాడు. ఎలాగూ తీసుకున్నాం కదా అని తెరిచి నోట్లో పెట్టుకున్నాడు. యాక్, ఇది మలం లాగా ఉంది అన్నాడు. ఆ పిల్లాడు అవును సార్. టూత్ బ్రష్ తీసుకుంటారా సార్ అన్నాడు. కాబట్టి మనం సమస్యలను ఈ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం. మతాలు సమస్యలను ఈ విధంగా హ్యాండిల్ చేసాయి. మీ జీవితంలో మీరు చేసే ప్రతిదానికీ మీకు అపరాధ భావన కలిగేలా చేస్తారు.
మీరు ప్రతిదానికీ భయపడేలా చేస్తారు మీరు దేవునికి కూడా భయపడతారు. భయం, అపరాధ భావన. ఇవి గొప్ప భావోద్వేగాలు కావు ఇవి మనిషిని కుంగదీస్తాయి. వీటిని సృష్టించి వీటి కోసం ప్రాయశ్చిత్తాన్ని కూడా సృష్టిస్తారు. అప్పుడు డబ్బు చెల్లిస్తే ప్రతిదానికీ డబ్బు ప్రమేయం ఉంటుంది. డబ్బు చెల్లిస్తే, వాళ్ళు మిమ్మల్ని ఆ అపరాధ భావన నుండి విముక్తి చేస్తారు. అన్ని మతాల్లో అంటున్నాను. ఉందా లేదా? కాబట్టి అదే విధంగా. మీరు అనారోగ్యం తెచ్చుకుంటారు.
ఆ తర్వాత. మీకు డాక్టర్ కావాలి. నేననేది మీ ఆరోగ్యం మీ బాధ్యత అని ఎందుకు అర్థం చేసుకోరు? దానికి మించి ఏదైనా తప్పు జరిగితే. నాలాగా వెళ్లి మీ తలని గోడకి కొట్టుకోవడమో. లేదా ఇంకేదైనా జరిగితే. అప్పుడు మీకు డాక్టర్ సహాయం అవసరం. మీ తల పగలగొట్టుకున్నారు డాక్టర్ సహాయం అవసరం. మీ ఎముకలు విరగ్గొట్టుకున్నారు డాక్టర్ సహాయం అవసరం. కానీ ఇక్కడ శాంతంగా కూర్చోవడానికి మీకు డాక్టర్ సహాయం ఎందుకు? మీరు ఏదో తప్పు చేస్తున్నారు అవునా కాదా?
మీరు దాన్ని అర్థం చేసుకోవద్దా? డాక్టర్ వచ్చి మొత్తం జనాభాని సరిచేయగలడని అనుకుంటున్నారా? కొంతమంది అనారోగ్యంతో ఉన్న ప్రజలని డాక్టర్ సరిచేయగలడు. మొత్తం జనాభాని ఆయన సరిచేయగలడా? అప్పుడు మీరు జనాభాలో 50% మందిని డాక్టర్లుగా సైకియాట్రిస్టులుగా. లేదా మెడికల్ డాక్టర్లుగా చేయాలి. అది మంచి సమాజమా? కాదు. కాబట్టి నేను చెప్పేది అదే. మీ వ్యక్తిగత ఆరోగ్యం మీ బాధ్యత. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటాన్ని మీ పనిగా చేసుకోవాలి.
దానికి మించి ఏదైనా జరిగితే డాక్టర్ ఉన్నాడు. లేదు మొత్తం ప్రపంచం ఇలాగే మారుతోంది. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా అది గ్రహం మీద అత్యంత ధనిక దేశం. ప్రస్తుతానికి సంపద ఎందుకు ప్రజలకి ఆకర్షణీయంగా ఉంటుందంటే. అది ఒక వ్యక్తి అయినా సమాజం అయినా లేదా దేశం అయినా. అందరూ ఎందుకు ధనవంతులు కావడానికి ప్రయత్నిస్తున్నారంటే. మొదట్లో సంపద వచ్చినప్పుడు. మీకు పోషణ ఎంచుకునే అవకాశం ఉంటుంది.
మీకు మంచివైనవి సాధ్యమైనంత ఉత్తమమైన వాటిని తినవచ్చు. తర్వాతి విషయం మీకు జీవనశైలులు ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికాలో పోషణ, జీవనశైలి గురించి సంపూర్ణ ఎంపిక ఉంది. వాళ్ళ ఆరోగ్య సంరక్షణ బిల్లు ఏంటి? 4.2 ట్రిలియన్ డాలర్లు. అది మన మొత్తం ఆర్థిక వ్యవస్థతో సమానం, మనం 1.4 బిలియన్ల ప్రజలం. వాళ్ళు 350 మిలియన్ల ప్రజలు. మన మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి.
సమానమైన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. అది ఆరోగ్యకరమైన దేశమా అని అడుగుతున్నాను? ఎందుకంటే. ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి మెడికల్ కంపెనీలు ఉన్నాయి. కార్పొరేషన్లు ఉన్నాయి అన్ని రకాల విషయాలు ఉన్నాయి. అందరి కడుపులు నింపాలి. ఆహరం సంపాదించుకోడానికి వేరే మంచి మార్గాలు ఉన్నాయ్. అనారోగ్యం ఏదో ఒక రూపంలో అందరికీ వస్తుంది. ఏదో ఒక సమయంలో అనారోగ్యం, కాకపోతే గాయం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది.
దానికి మనకి డాక్టర్లు కావాలి. అందరూ అనారోగ్యం పాలవడం వారి హక్కనుకుంటారు. అనారోగ్యం పాలవడం మీ హక్కు కాదు. ఆరోగ్యంగా ఉండటం మీ పని అవునా కాదా? కొంత యోగా చేయండి. తప్పకుండా. ఇంకా ఆ డాక్టర్లందరూ నేను ఇలా ఉన్నానని నమ్మరు. వాళ్ళు నాకు కాగ్నిషన్ లాస్ అవుతుందని అన్నారు. నాకు ఫ్యాకల్టీ లాస్‌లు అవుతాయని అన్నారు. వరుసగా రెండు సర్జరీలు. ఇంకా వాళ్ళు నాతో సద్గురు మూడవ సర్జరీ అనేదేమీ లేదు. మీరు మళ్ళీ వెళ్ళి ఫుట్‌బాల్ ఆడి తలతో బంతిని ఇలా కొట్టి ఇలా చేస్తే.
మీకు మూడవ సర్జరీ లేదు. రెండు సర్జరీలు జరిగాయి మీకు మూడవ సర్జరీ అనేది లేదు. మోటార్ సైకిల్ మీద వెళ్ళకండి అన్నారు. అయినా మీరు వెళ్తున్నారు. అఫ్కోర్స్. ఇంకా. నేను కైలాష్ వెళ్ళినప్పుడు, వెళ్లడం సవాలుగా ఉంటుంది ఎందుకంటే. సర్జరీల తర్వాత కదా? సర్జరీ తర్వాత. ఎత్తు ఉంటుంది. మేము దాదాపు 18,000 అడుగులకు పైగా ఎత్తుకు వెళ్తున్నాం. నా డాక్టర్‌కి చెప్తే ఆయన లేదు మీరు వెళ్లే ప్రసక్తే లేదు అంటారు.
కాబట్టి నేను వెళ్ళి అక్కడి నుండి ఆయనకి ఫోన్ చేశాను. ఆయన ఏం చేయాలి? నేను సోషల్ మీడియా పోస్టులు చూస్తున్నాను సద్గురు. మీరు ఇప్పటికే అక్కడ ఉన్నారు నేనేం చేయగలను? నేను చెప్పినా మీరు ఎలాగూ వెళ్తారు అన్నారు. నేను సరే బాగానే ఉన్నాను సమస్య లేదు అన్నాను. ఆయన కేవలం పక్కా రోడ్ల మీదనే ఉండండి. మట్టి రోడ్ల మీద వెళ్ళకండి అన్నారు. ఎందుకంటే అక్కడే రిస్క్ ఉంటుంది. కానీ తర్వాతి రోజు నేను ఒక చాలా ప్రమాదకరమైన మట్టి రోడ్డు మీద వెళ్ళాను. చాలా ప్రమాదకరమైన మట్టి రోడ్డు.
తడి మట్టి రోడ్డు. ఇంకా పడ్డాను. పడ్డారా? తల తగిలించుకోలేదు లేచి రైడ్ చేస్తూ వెళ్ళిపోయాను. నేననేది. భద్రత ఇంకా సురక్షితత్వం పేరుతో. మీ జీవితాన్ని జీవించకుండానైనా ఉండొచ్చు లేదా మీ జీవితాన్ని జీవించవచ్చు. అప్పుడు బతకొచ్చు లేదా చావొచ్చు. ఎలాగూ అందరూ చనిపోతారు వాళ్ళు తెలుసుకోవాలి. ఇది వాళ్ళందరికీ ఒక రిమైండర్ అందరూ చనిపోతారు. కానీ వాళ్ళు కేవలం ఇతరులే చనిపోతారనుకుంటారు.
నేను వాళ్ళకి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా చనిపోతారు అని. ఇది ఏదో సాడిస్టిక్ సంతృప్తి కోసం కాదు. మీరు చనిపోతారు మీరు చనిపోతారు అనడం కాదు. వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కోసం ఉన్నది పరిమిత సమయం అని. మీ జీవితంలో గొప్ప సంభావ్యతని సాధ్యం చేసుకోండి. ఇంత పరిమిత సమయం ఉన్నప్పుడు. మీకు ఏ మాత్రం అర్థం లేని ఒక్క పని కూడా చేయకండి. మీకు వ్యతిరేకంగా ఉన్న ఒక్క పని కూడా చేయకండి. ఇంకా మీకు ఎవరికీ వ్యతిరేకంగా ఏమీ చేయడానికి సమయం ఉండదు. ఎందుకంటే అది విలువైనది. మీరు ఈ జీవితంలో ఉన్న కొద్ది సమయాన్ని వృధా చేయాలనుకోరు.
ఎవరి గురించో లేదా మీ గురించో ఏదో చెత్త చేస్తూ. నాకా సమయం లేదు. ఇంకా నేను మిమ్మల్ని ఒక సలహా అడుగుదాం అనుకున్నాను. కానీ సలహా వచ్చేసింది. పాడ్కాస్ట్ని ముగించడానికి తెలుగులో ఏదైనా ఒక చిన్న లైన్? ఎందుకంటే మాది తెలుగు పాడ్‌కాస్ట్. వస్తావట్టిదే పోతావట్టిదే. చాలు కదా ఒక లైను. నాలుగు లైన్లు జీర్ణం చేసుకోవడం వాళ్లకి కొంచెం కష్టం. ఫస్ట్ లైన్ ఓకే. థాంక్యూ వెరీ మచ్ నమస్తే. థాంక్యూ నమస్కారం. నమస్కారం.
